Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా నేటికీ సమాది నుంచి భక్తులకు మహిమను చూపిస్తున్నాడు

By manavaradhi.com

Updated on:

Follow Us

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో సాయిబాబా ఆలయం ఉంది. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు. షిర్డీ సాయిబాబా నేటికీ సమాదినుంచి తన మహిమను చూపిస్తున్నాడని అనేక మంది భక్తుల విశ్వాసం. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు ఆ షిర్డీ సాయినాథుడు. సాయిబాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు. అయితే సాయిబాబాను కొందరు హిందువుగా, మరికొందరు ముస్లింగా భావించి పూజిస్తూ ఉంటారు. అయితే అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండడానికి ఇదే కారణం. సాయినాథుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలు ఉన్నాయి. అయితే సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. అయితే సాయి బాబా జన్మించింది మహారాష్ట్రలోని షిర్డీ గ్రామంలో అని చెబుతారు. ఇప్పుడు షిర్డీలో బాబా కోసం గొప్ప ఆలయం నిర్మించారు.

షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన ఉన్న గురుస్థానంలో ఆయన కూర్చొని ఉండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు. షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా ఉండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధి నుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్య వ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజన క్షేత్రంగా మారిపోయింది.

షిర్డీలో సాయిబాబా ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటె బాబా ధునిలో కర్పూరం, చందనం వంటి వాటిని వేయవడం వలన కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే సాయిబాబా ధునిని చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తులు తమతో పాటు ధుని నుంచి విభూతిని తీసుకుని వెళ్తారు. వేప చెట్టు షిర్డీ లో మరొక అద్భుతం వేప చెట్టు. ఈ చెట్టు కింద సాయిబాబా కూర్చునేవారు. బాబా అద్భుతం వల్ల వేప ఆకులోని చేదు మాయం అయి తీపిగా మారాయి. షిర్డీలో సాయినాథునికి ప్రతి రోజు ఐదు సార్లు హారతి ఇస్తారు. భూపాలి, కాకర, మధ్యాహ్న, సాయంత్రం, రాత్రి ఇలా ఐదు సార్లు హారతినిస్తారు. అయితే షిర్డీ సాయిబాబా దర్శనానికి గురువారం ఎక్కువ మంది భక్తులు ఆలయానికి చేరుకుంటారు.

1 thought on “Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా నేటికీ సమాది నుంచి భక్తులకు మహిమను చూపిస్తున్నాడు”

Leave a Comment