సినీ ప్రియులు ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘సలార్’ మూవి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. రావడమే కాదు విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మేకింగ్ కు అటే ప్రభాస్ (Prabhas) యాక్షన్ చూస్తుంటే సినీఅభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిప్రియులతో పంచుకున్నారు.
నిజానికి ‘‘సలార్’ కథను దర్శకుడు ప్రశాంత్ నీల్ 15 ఏళ్ల క్రితమే అనుకున్నారట. కానీ తన మొదటి సినిమా ‘ఉగ్రం’ చేసిన తర్వాత ‘కేజీఎఫ్’ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు ప్రశాంత్ నీల్. కానీ అది రెండు భాగాలు తీసారు.. తీర అదికాస్తా పూర్తయ్యే సరికి 8 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత ‘సలార్’ పనులు ప్రారంభించారు. దీని షూటింగ్ ఎక్కువ భాగం మన హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే పూర్తి చేశారు. అంతేకాదు సింగరేణి మైన్స్, సౌత్ పోర్ట్స్, వైజాగ్ పోర్ట్స్‌లలో కూడా కొన్ని షెడ్యూళ్లు జరిపారు. యూరప్‌లోనూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాంరు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సలార్ సినిమా మొత్తాన్ని 114 రోజుల్లో పూర్తి చేశారంట. ఇక ‘సలార్’ రెండో భాగానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రశాంత్‌నీల్ చెప్పుకోచ్చారు.
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సలార్ యాక్షన్ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విడుదల చేసిన ట్రైలర్‌తో సలార్ మూవిపై అంచనాలు రెట్టింపయ్యాయి. బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్’ (Salaar) రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ (salaar heroine) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్‌గా కనిపించనున్నారు. టీనూ ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.