AP Home Minister Anita: ఏపీ హోంమంత్రి అనిత‌ భోజనంలో బొద్దింక .. హాస్టల్‌లో విద్యార్థుల పరిస్థితి ఏంటి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Home Minister Anitha Sudden Visits BC Girls Hostel

హోం మంత్రి వంగలపూడి అనితకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్‌ ‘సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. హాస్టల్‌లో వసతులు తెలుసుకుని, అక్కడి పరిస్థితులు, భోజనం పరిశీలించడానికి వెళ్లిన ఏపీ హోమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని ఒక బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన ఆమె అక్కడి విద్యార్థినులతో కలిసి భోజనం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్‌లోనే బొద్దింక వచ్చింది. ఆ ఘటనను చూసి అవక్యాయిన హోమంత్రి అక్కడి వంట మనుషులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పర్యటనలోనే ఇలా చేదు అనుభవం ఎదురవ్వడం, తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక రావడాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. వంట సిబ్బందికి ఆ బొద్దింకను చూపించి, పిల్లలకు రోజు ఇలాంటి భోజనమే పెడుతున్నారా అంటూ మండిపడ్డారు. ఇక స్కూళ్లలో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా ఇప్పటి వరకు గ్రౌండ్ లెవల్‌లో అది జరగకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు.

స్కూళ్లలో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ లెవల్‌లో అది జరగటం లేదని మండిపడ్డారు. ఒకరిద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికి వస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మంత్రికి పెట్టిన భోజనంలోనే బొద్దింక వస్తే ప్రతిరోజు హాస్టల్‌లో విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలా భోజనం పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment