ఇప్పటివరకూ 8 సీజన్లు పూర్తి చేసుకున్న రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ మొదలైంది. ఈ షో సరికొత్త హంగులతో సెప్టెంబరు 7వ తేదీ నుంచి ఆరంభమైంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు, సామాన్యులకు సమాన అవకాశం ఇస్తున్నట్లు వ్యాఖ్యాతగా నాగార్జున ప్రకటించారు. ఇందులో భాగంగా నిర్వహించిన బిగ్‌బాస్ అగ్ని పరీక్షను దాటుకుని 13మంది ఫైనల్‌కు చేరుకున్నారు. వీరి నుంచి ఆరుగురిని ఎంపిక చేసి హౌస్‌లోకి పంపారు.
సెలబ్రిటీల నుంచి 9మంది ఈ సీజన్‌లో అడుగు పెట్టారు. మొత్తం బిగ్‌బాస్ సీజన్-9లో 15మంది కంటెస్టెంట్‌లు అయ్యారు. మెయిన్ హౌస్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక అవుట్ హౌస్‌లో ఏమీ ఉండవు. అగ్నిపరీక్షలో తమ సత్తా చాటిన సామాన్యులు మెయిన్ హౌస్‌లో ఉంటారని, సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో అవుట్ హౌస్‌లో ఉండాలని వ్యాఖ్యాత నాగార్జున సూచించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో బిగ్‌బాస్ అప్‌డేట్స్ ఇస్తారని వివరించారు.

బిగ్‌బాస్ సీజన్-9లో తొలి కంటెస్టెంట్‌గా బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి అడుగు పెట్టారు. తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియదని చెప్పింది. వాళ్లు సంతోషించేలా నడుచుకుంటానని హామీ ఇచ్చింది.

ఈ సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా నటి ఫ్లోరా షైనీ (ఆశాషైనీ) అడుగు పెట్టారు. ‘నరసింహ నాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

సామాన్యుల నుంచి కల్యాణ్ పడాల మూడో కంటెస్టెంట్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. బిగ్‌బాస్ టీమ్ నిర్వహించిన అగ్ని పరీక్ష దాటుకుని ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కల్యాణ్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి.

ఈ సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా సెలబ్రిటీల నుంచి ఇమ్మాన్యుయేల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ‘జబర్దస్త్’ షో సహా పలు సినిమాల ద్వారా ఇమ్మాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.

ఐదో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టారు. తనకు ఈ రియాల్టీషో అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.

అగ్నిపరీక్షలో భాగంగా జ్యూరీ మెంబర్స్‌ను మెప్పించిన హరిత హరీశ్ అలియాస్ మాస్క్ మ్యాన్ బిగ్‌బాస్ సీజన్9లోకి అడుగు పెట్టారు. జ్యూరీ మెంబర్ అయిన బిందు మాధవి.. ఆయన పేరును ప్రకటించారు. హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ రావడంతో తన కల సాకారమైనట్లు హరీశ్ చెప్పారు.

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై అలరించిన భరణి కూడా సీజన్9కు వచ్చారు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి బుల్లితెర నటి, యాంకర్ రీతూ చౌదరి అడుగుపెట్టారు. తన అసలు పేరు దివ్య అని, స్కూల్‌లో ఆ పేరు నచ్చక రీతూ అని మార్చుకున్నట్లు చెప్పారు. ‘

మూడో సామాన్యుడిగా డిమోన్ పవన్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. తాను జపనీస్ నవలలు బాగా చదువుతానని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.

‘బుజ్జిగాడు’ సహా పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటి సంజన గల్రానీ బిగ్‌బాస్ సీజన్9లోకి వెళ్లారు. నేనూ 2006 నుంచి స్నేహితులం. ఒకరినొకరు అర్థం చేసుకుని 2020లో పెళ్లి చేసుకున్నాం. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లను వదిలేసి వస్తున్నా. కొన్ని సార్లు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని సంజనా చెప్పుకొచ్చారు.

‘రాను బొంబయికి రాను..’ అంటూ సోషల్ మీడియాను ఊపేసిన గాయకుడు రాము రాథోడ్. అలాంటి ఫోక్ సాంగ్‌తో అలరించిన రాము రాథోడ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు.

సామాన్యుల కేటగిరీ నుంచి శ్రీజ దమ్ము బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఎప్పుడైనా నామినేషన్స్‌లో ఉంటే ఓట్లు వేసి గెలిపించండి’’ అంటూ ప్రేక్షకులను కోరారు.

సెలబ్రిటీ కేటగిరి నుంచి హాస్య నటుడు సుమన్‌శెట్టి బిగ్‌బాస్ సీజన్9లోకి అడుగు పెట్టారు. ‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన ‘7/జీ బృందావనకాలనీ’ సహా పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు.

సామాన్యుల కేటగిరి నుంచి ఆడియెన్స్ ఓట్ల ద్వారా ప్రియశెట్టి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ప్రేక్షకులు ఓటు వేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చినందుకు బాగా ఆడతా’’ అని ప్రియాశెట్టి ప్రేక్షకులను కోరింది.

చివరిగా వచ్చిన యాంకర్ శ్రీముఖి, నటుడు అభిజీత్ విన్నపం మేరకు సామాన్యుల నుంచి మనిష్ మర్యాదను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపారు.