CRDA Headquarters: అమరావతి అభివృద్ధి పనులను చూసుకుంటున్న క్యాపిటర్ రీజన్ డెవలప్‌మెంట్ అథార్టీకి ఇప్పుడు సొంత భవనం వచ్చేసింది. ఇక అభివృద్ధి పనులు వేగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భవనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పూర్ణకుంభం, వేదాశీర్వచనాలతో సీఎంకు వేదపండితులు స్వాగతం పలికారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో (జీ+7) సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సీఆర్డీఏ సహా.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ‘ఎ’ అక్షరం ఎలివేషన్‌తో తీర్చిదిద్దారు.
ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడగుల విస్తీర్ణంలో ఉంది. పాలనా సౌలభ్యం కోసం హెచ్‌వోడీలన్నీ ఒకేచోట ఉండేలా భవనాల నిర్మాణం చేపట్టారు. సీఆర్డీఏ భవనం మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. 2, 3, 5 అంతస్తుల్లో సీఆర్డీఏ, నాలుగో అంతస్తులో సీడీఎంఏ పురపాలక డైరెక్టరేట్ ఉంది. ఆరో అంతస్తులో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.

మరోవైపు ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో.. మరో 4 భవనాలు నిర్మించారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. కాగా ఇంతకుముందు వరకు సీఆర్డీఏ కార్యాలయం విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించింది. ఇప్పుడు సీఆర్డీఏ భవనం పూర్తి కావడంతో.. వివిధ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండనున్నాయి. ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించే వీలు ఉంటుంది. ఇక రాజధాని అభివృద్ధి పనుల పునరుద్ధరణ కూడా వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.









