Gold Price: ఇటీవల బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదల తర్వాత కొంతమేర చల్లబడాయి. గత రెండు వారాల్లో రూ.10 వేలకు పైగా తగ్గింది పుత్తడి.. ఈ క్రమంలో బంగారం ధర ఈరోజు కూడా భారీగా పడిపోయింది. దాదాపు రూ.2వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి..
బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధరపై రూ.191 తగ్గి.. రూ.12,049గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.175 తగ్గి.. రూ.11,045గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ గురువారం ఉదయం రూ.1,20,490గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,450గా ట్రేడ్ అవుతోంది. ఈ పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,490గా నమోదవగా.. 22 క్యారెట్ల ధర రూ.1,10,450గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,21,090గా.. 22 క్యారెట్ల రేటు రూ.1,11,00గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,20,640గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,10,600గా ట్రేడ్ అవుతోంది. ఈ బంగారం ధరలకు జీఎస్‌టీ అదనంగా ఉంటుందన్న విషయం గుర్తించుకోవాలి.
మరోవైపు వెండి ధరలు కూడా నేడు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై నిన్న వెయ్యి పెరిగగా.. ఈరోజు అదే వెయ్యి తగ్గింది. గురువారం కిలో వెండి ధర రూ.1,51,000గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,65,000గా ట్రేడ్ అవుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,51,000గా నమోదైంది. రెండు లక్షల 10 వేల వరకు దూసుకెళ్లిన వెండి ధర.. ఈ మేర తగ్గడం సంతోషించాల్సిన విషయం.









