నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ (Ram Charan) దంపతులు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఉపాసన పోస్ట్ పెట్టారు. ఈ దీపావళి తమ ఇంట ఆనందాన్ని రెట్టింపు చేసిందని.. రెట్టింపు ఆశీర్వచనాలు అందాయని ఆనందం వ్యక్తంచేశారు. ఒక క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన ఉపాసన.. తమ ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయని తెలుపుతూ ఈ గుడ్‌న్యూస్‌ను షేర్ చేశారు. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు ఉపాసనకు (Upasana) స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశీర్వదించారు.
ఇటీవల చిరంజీవి (Chiranjeevi) తన నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అగ్ర కథానాయకులు వెంకటేశ్, నాగార్జున దంపతులతో పాటు.. కథానాయిక నయనతార జంట కూడా సందడి చేసింది. తాజా వీడియోలో వీరంతా ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు. దీంతో పండగ రోజు ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఉపాసన ఈ శుభవార్త చెప్పగానే ‘సింబా’ వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.









