Sri Srinivasa Gadyam
Sri Srinivasa Gadyam – శ్రీ శ్రీనివాస గద్యం
—
శ్రీమదఖిల మహీమండల మండన ధరణిధర మండలాఖండలస్య, నిఖిల సురాసుర వందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధి వీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుష ...