పోషకాహార లోపం – ఎలాంటి లక్షణాల ద్వారా పోషకాహార లోపం ఉందని తెలుసుకోవచ్చు

By manavaradhi.com

Published on:

Follow Us

ఆహారం పరంగా, పోషణ పరంగా భారతదేశం మిగులు సాధించుకోగలిగినప్పటికీ హిడెన్ హంగర్ దేశాన్ని బాధిస్తోంది అనేది హరితవిప్లవ పితామహుడు స్వామినాథన్ చెబుతున్నా మాట. నిత్యం సరైన స్థాయిలో ఆహారం తీసుకుంటున్నా, పోషకాహార లోపం, విటమిన్ లోపం భారతదేశానికి సవాలుగా మారుతున్నాయి. ఇలాంటి లోపాలను ఏయే లక్షణాల ద్వారా గుర్తించవచ్చు, దానికి పరిష్కార మార్గాలేమిటో తెలుసుకుందామా.

ఆహారం ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందనేది తిరుగులేని సత్యం. మన శరీరానికి అవసరమైన అన్ని పదార్థాలు అవసరమైన స్థాయిలో శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారా బైటనుండి శరీరం పొందుతుంది. అలాంటి పదార్థాలను పోషకాలు లేదా న్యూట్రియెంట్స్‌ అంటాము. ఇవి ఆహారంలో లభించనప్పుడు పోషకాహార లోపం లేదా న్యూట్రియెంట్‌ డెఫి షియెన్సీ ఏర్పడుతుంది. పోషకాలు ప్రధానంగా మూడు రకాలు. మేజర్‌ న్యూట్రియెంట్స్‌, మాక్రో న్యూట్రియెంట్స్‌, మైక్రో న్యూట్రియెంట్స్‌. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలను మేజర్‌ న్యూట్రియెంట్స్‌ అంటారు. సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ మొదలైన వాటిని మాక్రో న్యూట్రియెంట్లంటారు. విటమిన్లు, కొన్ని రకాల ఖనిజాలు మైక్రో న్యూట్రియెంట్స్‌ కోవకు వస్తాయి. రోజుకు 100 మిల్లీ గ్రాములకంటే తక్కువగా అవసరమయ్యే వాటిని మైక్రో న్యూట్రియెంట్లు అంటారు. పోషకాహారలోపం అనేది సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కలుగవచ్చు. లేదా కొన్ని వ్యాధుల కారణంగా కాని, కొన్ని సమయాల్లో శరీరానికి అధికంగా పోషకాలు అవసరమైనపపడు కాని, లేదా పోషఖాలను సరిగ్గా జీర్ణం చేసుకోలేన ప్పుడు కాని, అన్నవాహికనుంచి రక్తంలోకి పోషకాల శోషణ సక్రమంగా జరుగనప్పుడు కాని సంభవించవచ్చు.

మన దేశంలో పోషకాహారం తీసుకోని వారు చాలా మంది ఉన్నారు. 36 శాతం స్త్రీలు, 34 శాతం పురుషులు ఇప్పటికీ పోషకాహార లోపం తో బాధపడుతు న్నారని అంచనా. పోషకాహార లోపం మానసిక సమస్య లను, మాన సిక సమస్యలు పోషకాహార లోపాన్ని పరస్పరం ఉధృతం చేసుకుంటాయి. కొన్నిసార్లు మనం వాడే మందుల వల్ల కూడా పోషకాహార లోపం సంభవించవచ్చు. ఉదాహరణకు యాంటి కన్వల్సెంట్స్‌ వాడినప్పుడు ఫోలేట్‌ లోపం కలుగ వచ్చు. యాంటి డిప్రెసెంట్లు వాడినప్పుడు రక్తంలో సోడియం తక్కువ కావచ్చు. శరీర నిర్మాణానికి ప్రోటీన్లు ఎంతో ముఖ్యమైనవి. మెదడులోని అనేక రసాయనాలు ప్రోటీన్లు లేదా అమైనోయాసిడ్స్‌ నుంచి ఏర్పడుతాయి. ఆహారంలో ట్రిప్టోఫాన్‌, థైరోసిన్‌ లోపం ఏర్పడితే అది డిప్రెషన్‌కు కారణం కావచ్చు. కార్బొ హౖడ్రేట్లు తక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల డిప్రెషన్‌ కలుగవచ్చు. కార్బొ హైడ్రేట్లు అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు, గోధుమ, వరి మొదలైనవి దీర్ఘకాలం పాటు మెదడు కు హుషారు, చురుకుదనం కలగడానికి ఉపకరిస్తాయి. కాగా, తీపి పదార్థాలు తాత్కాలికంగా మాత్రమే పని చేస్తాయి. అయినప్పటికీ, శరీరానికి పూర్తిగా కొవ్వు పదార్థాలు అవసరం లేదని మాత్రం కాదు. మెదడులో కొలెస్టరాల్‌ శాతం చాలా అధికంగా ఉంటుంది. ఇది కణాల పై పొరల నిర్మాణానికి అవసరం. తగిన స్థాయిలో కొవ్వు పదార్థాలు తీసుకోవడం అవసరం. కనుక పూర్తిగా కొవ్వు పదార్థాలను మానేయడం సరికాదు. శరీరానికి అవసరమైన నిష్పత్తిలో, తగిన సమయంలో, సమతులంగా ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, కార్బొహైడ్రేట్లు తీసుకోవడం ముఖ్యం.

శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాలు చాలా అవసరం.శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌, ఫ్యాట్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌లోపం ఉండడం వల్లే చిన్న చిన్న వ్యాధులు దాడి చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. వాళ్లకు సరైన స్థాయిలో పోషకాహారం లభించడం లేదు. పోషకాహార లోపం కారణంగా.. మానసిక ఏకాగ్రత, మెమరీ, బలహీన శరీరం, బలహీన రోగనిరోధక శక్తి, త్వరగా అనారోగ్యం పాలవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పోషకాహార లోపం నుంచి బయటపడేయాలంటే.. న్యూట్రీషన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రస్తుతం క్యాలరీలు ఎక్కువ ఉండి.. పోషకాలు తక్కువగా ఉన్న ఆహారాలే ఉంటున్నాయి. హై క్యాలరీ ఫుడ్స్, న్యూట్రీషియస్ ఫుడ్ కి తేడా తెలుసుకోవాలి. హై క్యాలరీ ఫుడ్ కేవలం పొట్టను నింపుతుంది కానీ.. శరీరాన్ని కాదు. కాబట్టి ఖచ్చితంగా హై క్యాలరీ, హై న్యూట్రీషియస్ ఫుడ్ ని తీసుకోవాలి. అప్పుడే పొట్టతో పాటు, శరీరానికి కూడా బలవర్థక ఆహారం అందుతుంది.

Leave a Comment