సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మందికి పుట్టగొడుల రుచి, వాసన పట్టదు. అటువంటి వారు మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, వెంటనే తినడం ప్రారంభించేస్తారు. అన్ని గొప్ప ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో దాగి ఉన్నాయి. పుట్టగొడుగుల గురుంచి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం…
పుట్టగొడుగులు మంచి పౌష్టికాహారం ఎందుకంటే వీటిలో అపారమైన పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతాయి. అంతే కాదు మష్రుమ్ లో ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తుంది . పుట్ట గొడుగులు ప్రాచీనకాలం నుండి ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది తక్కువ క్యాలరీలున్న ఆహారం పదార్థం. ఇంకా ఇందులో అనేక మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.
మష్రుమ్ లో విటమిన్ బి, డి, పొటాషియం, కాపర్, ఐరన్ మరియు సెలీనియం అనే మినిరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి . ఇందులో కోలిన్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ ముఖ్యమైన న్యూట్రీషియన్స్ కండరాల కదలికలకు సహాయపడుతాయి. వ్యాధినిరోధకతను పెంచి, ఇన్ఫెక్షన్స్ బారీ నుండి శరీరాన్ని కాపాడుతాయి. ఇది చిన్న చిన్న జబ్బులను జలుబు మరియు ఫ్లూ వంటి వాటిని నివారిస్తుంది. ఇందులో ఉండే సెలీనియం వ్యాధినిరోధకతను పెంచే బాధ్యత కలిగి ఉంటుంటి. టి సెల్స్ యొక్క ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది.శరీరం యాక్టివ్ గా ఉండాలంటే మష్రుమ్ లో ఉండే న్యూట్రీషియన్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. మష్రుమ్ ను రెగ్యులర్ గా తీసుకుంటుంటే బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వీటిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక. మరియు ఫ్యాట్ పూర్తిగా ఉండదు . మష్రుమ్ ఆకలికోరికలను తగ్గిస్తుంది మరియు చాల తక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది.
- డయాబెటిక్ వారికి మష్రుమ్స్ హీలింగ్ ఫుడ్ వంటిది. మష్రుమ్ లో నేచురల్ ఇన్సులిన్ మరియు ఎంజైమ్స్ కలిగి ఉన్నాయి. ఇవి మనం తీసుకొనే ఆహారం నుండి షుగర్స్ మరియు స్ట్రార్చ్ లను విడగొడుతుంది.
- మష్రుమ్ లో చాలా తక్కవు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కాబట్టి, ఇది షుగర్ లెవల్స్ ను పెంచదు . రీసెర్చ్ ప్రకారం మష్రుమ్ లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. రెగ్యులర్ డైట్ లో మష్రుమ్స్ జోడించడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది .
మష్రుమ్ లో ఉండే పొటాషియం టెన్షన్స్ నుండి విముక్తి కలిగిస్తుంది . ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడం మరియు క్రమబద్దం చేయడానికి మష్రుమ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. మష్రుమ్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఫ్యాట్ తక్కువ , తక్కువ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటాయి. కాబట్టి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి ఇందులో బెస్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి. లీన్ ప్రోటీన్ మరియు ఫంగై బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.
మష్రుమ్స్ మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి ?
మష్రుమ్ బోన్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది . ఈ ఆర్గానిక్ ఫుడ్స్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎముకలకు కావల్సినంత క్యాల్షియంను అందివ్వడంతో పాటు ఎముకలకు రక్షణ కల్పిస్తుంది.రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆస్ట్రియోఫోరోసిస్ నుండి రక్షణ కల్పిస్తుంది. మష్రుమ్స్ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ ప్రమాధాల నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది . వీటిలో ఉండే పోషకాలు, మినిరల్స్, విటమిన్స్, కెమికల్స్ క్యాన్సర్ ప్రమాధం నుండి రక్షణ కల్పిస్తాయి.
మష్రుమ్ కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది . ఇది కాలేయంలో చేరిన టాక్సిన్స్ ను తొలగించి హెల్తీ లివర్ గా తయారవుతుంది. అంతే కాదు దాంతో కాలేయం చురుకుగా పనిచేస్తుంది. స్టమక్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే వారు మష్రుమ్స్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. మష్రుమ్ లో ఉండే లక్షణాలు హానికరమైన బ్యాక్టిరియా తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో స్టమక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.నొప్పులను, వాపులను నివారించడంలో బెస్ట్ మెడిస్ మష్రుమ్. పుట్టగొడుగుల వలన మన రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారై మనం అనారోగ్యాల పాలుకాకుండా కాపాడుతుంది.
మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న పుట్టగొడుగులు పోషకాల లోపంతో బాధపడుతున్నవారికి మంచి ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవారికి సైతం ఇవి మేలు చేస్తాయి. కాబట్టి మీరు మష్రుమ్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి.