Health Benefits:కుక్కను పెంచుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్​!

By manavaradhi.com

Updated on:

Follow Us

పెంపుడు జంతువులు మంచి నేస్తాలే కాదు ఇంట్లోని వారిని చలాకీగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఇందులో కుక్కల స్థానం వేరేవాటితో పోల్చలేనిది. పెంపుడు జంతువులు బేషరతుగా ప్రేమను ఇస్తూ, దగ్గరితనంతో మెలగడమే కాక వాటివల్ల మనం కూడా శారీరకంగా ఫిట్‌గా ఉండేలా చేస్తాయి. ఎలాగంటే వాటిని సాకడానికి, చెప్పింది వినేలా చేయడానికి శారీరకంగా చాలా శ్రమపడాలి. ఒకరకంగా ఎంతో వ్యాయామం చేయాలి. అంతేకాకుండా ఇవి మన పనిఒత్తిడిని మాయం చేసి, ఉల్లాసం కలిగించేవి కూడా పెంపుడు జంతువులే. మానవుని ఏకైక విశ్వసనీయ సహచరునిగా పెంపుడు కుక్కకు పేరుంది, మరియు ప్రపంచంలో ఏ ఇతర అంశమూ పెట్స్ కలిగి ఉన్నంత ఆనందాన్ని ఇవ్వలేదు. పెంపుడు కుక్కలు మీ కుటుంబంలో అదనపు వ్యక్తి అన్న భావనను కలిగిస్తాయి. ఇవి మీకు తోడుగా ఉండడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని పెంచే క్రమంలో భాగంగా అదనపు ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

పెంపుడు కుక్కల వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటి ?
విశ్వాసానికి మరో పేరుగా నిలిచే కుక్కల పెంపకంపై ప్రజల ఆసక్తి పెరిగింది. ఏదైనా అనారోగ్యం కలిగితే ఎంతో హైరానా పడిపోతున్నారు. శునక పెంపకానికి అలవాటు పడ్డ ప్రజలు అవి లేకుండా జీవించటమే కష్టతరంగా భావిస్తుంటారు. అయితే కుక్కలను పెంచుకోవడంలో సరైన అవగాహాన ఉండటం లేదు. శునకాల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ, ఆహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కొందరిలో సైతం ఉండటంలేదు. దీంతో కుక్కలు పెంచుతున్నామని ఆనందమే తప్ప, వాటి పరిరక్షణలో విఫలమవుతున్నారు. మనుషుల వలే జంతువులు కూడా జబ్బు పడుతుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైనప్పుడు తెలుసుకోవడం కొంచెం కష్టమే. వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, అలర్జీల వల్ల అవి కూడా జుబ్బు పడటాకి కారణం అవుతాయి. కాబట్టి పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు కొన్ని లక్షణాలను గుర్గించగలిగి నట్లైతే వాటని సురక్షితంగా ఉంచవచ్చు.

చాలా వరకూ పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు, అది కొంచెం ప్రమాధ స్థితికి చేరేంత వరకూ పెంపుడు కుక్క యజమానులు వాటిని గుర్తించలేరు. సరైన సమయంలో స్పందించి సరైన జాగ్రత్తలు మరియు మందులు ఉపయోగించవచ్చు. అంతే కాదు, పెంపుడు కుక్కలు జబ్బు పడినప్పుడు, డాగ్ ఓనర్స్ వ్యక్తిగతంగా డాక్టర్ ప్రిస్క్రిప్స్ లేకుండా వారంతట వారే ఎటువంటి మందులు ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

పెంపుడు కుక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తల తీసుకోవాలి ?
ఇంట్లో ఉన్న శునకం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే వాటికి సమతులాహారంతో పాటు ఎంతో కొంత వ్యాయామం చేయించాలి. అలాగే సరైన టైయింగ్ లేకుండా వాటిని బయటకు తీసుకోని వెళ్ళకూడదు. కొన్ని చాలా విపరీత మనస్తత్వంతో వ్యవహరిస్తాయి. శిక్షణ ఇస్తే ఈజీగా నేర్చుకుంటాయి. ఎప్పటికప్పుడు జుట్టు కత్తిరిస్తూ వుండాలి. గోళ్లు కత్తిరిస్తూ, రెండు మూడు రోజులకొకసారి అయినా పళ్లు శుభ్రం చేస్తూ ఉండాలి. ఎక్కువ సమయం పాటు ఒంటరిగా వదిలివేయకూడదు. అపార్ట్ మెంట్లు అంటే కొందరికి స్పేస్ తక్కువగా ఉండవచ్చు. అపార్ట్ మెంట్లో పెంచుకోవాలంటే ఆ కుక్కలు అరవకుండా ఉండాలి. లేదంటే పక్క అపార్ట్ మెంటు వాసులు గగ్గోలు పెడతారు. కుక్కలకు పలు రకాల వైరస్ ల వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పైగా అవి ఎవరినైనా కరిస్తే వారికి రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ క్రమం తప్పకుండా పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ప్రస్తుతం చాలా మంది కుక్కలను స్టేటస్‌ సింబల్‌గా పెంచుకుంటున్నారు. అలా కాకుండా వాటిపై ఇష్టంతో, ప్రేమగా పెంచాలి. పెంపుడు కుక్కలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్లు వేయించాలి. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి.. మనకు వాటివల్ల ఎలాంటి అనారోగ్యసమస్యలు రావు.

Leave a Comment