రోజురోజుకు జీవన విధానంలో మార్పులతో మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష సంబంధం ఉంటే చాలా సందర్భాల్లో పరోక్షంగా నిద్రపై దాని ప్రభావం ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
ప్రస్తుత సమాజం లో అందరు ఎదుర్కునే సమస్యలలో నిద్రలేపోవడం కూడా ఒకటి , మనిషికి నిద్ర చాలా అవసరం . శరీరం రీచార్జ్ కావాలంటే కంటి నిండా నిద్ర పోవాలి. అయితే మారుతున్న జీవనశైలి,మానసిక రుగ్మతల వల్ల క్రమంగా నిద్ర తక్కువైపోతోంది. కొందరిలోనైతే నిద్ర పూర్తిగా కరువైపోతుంది. ఇదే పరిస్థితి పదే పదే రిపీట్ అయితే ఆ ప్రభావం శరీరాన్ని దెబ్బతీస్తుంది. నిద్ర పట్టడానికి అందుకు అవసరమైన రసాయనాలు మెదడులోని కొన్ని ప్రదేశాల్లో తగిన మోతాదులో, తగిన సమయాల్లో విడుదలవ్వాలి. ఈ ప్రక్రియలో తేడా జరిగితే నిద్రకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సరిగా నిద్ర పట్టాలంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మాములుగా రాత్రి వేళల్లో ఆహారం ఎక్కువగా తెసుకుంటే నిద్ర పట్టదు అంటారు కానీ తక్కువ తిన్న కూడా నిద్ర కు అంతరాయం కలుగుతుంది ,అందుకే పోషకాలు నిండి ఉన్న హెల్తీ స్నాక్స్ తీసుకోవడం వల్ల పొట్ట తేలికగా ఉండటంతో పాటు కంటినిండా నిద్ర పడుతుంది.
- మనం రోజు తీసుకునే డైట్లో పోషక పదార్ధాలు ఉండాలి. ఓట్స్ ప్రశాంతమైన నిద్ర పొవడానికి బాగా ఉపయోగపడుతాయి. ఇందులోని విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, మెలటోనిన్ మెదడుని ప్రశాంతంగా ఉంచి నిద్రాభంగం లేకుండా చేస్తాయి.
- అరటి పండ్లలో మెగ్నీషియం, సెరటోనీన్, మెలటోనిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కావున వీటిని తినడం వల్ల మంచి నిద్రపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
- బాదంలో ఉండే హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం మంచినిద్రకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్లో ఉండేలా చూసుకోవడం మంచిది. మెలటోనిన్ అనే పదార్థం వాల్ నట్స్ సమృద్దిగా ఉంటుంది. ఇవి హాయిగా నిద్రపోయేందుకు దోహదం పడుతాయి. వాల్నట్స్లొ ఉన్నట్లే చెర్రీస్‌లో కూడా మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చెర్రీలను తినడం అలవాటు చేసుకోండి.
- గుడ్లులోని అమైనో యాసిడ్స్ నిద్రపోయేందుకు దోహదం చేస్తుంది. రోజూ గుడ్డు తినడం వల్ల మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
- భోజనం తర్వాత కాస్త మగతగానూ, నిద్రపడుతున్నట్లుగానూ అనిపించడం చాలామందికి తెలిసిందే. కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత వాటి నుంచి శక్తిని తయారు చేసేందుకు నిద్ర వస్తుంటుంది. అందుకే భోజనం తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది.
- పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అన్ని పోషకాలతో పాటు ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం మరీ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా ఉండే గోరువెచ్చటి పాలను నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం మేలు
- దీంతో పాటు, విటమిన్ సి పాళ్ళు ఎక్కువగా ఉండే బొప్పాయి, అనాస, నిమ్మజాతి పండ్లు సహజమైన రాత్రి నిద్రను కలగజేస్తాయి.
- స్పైసీ ఫుడ్ , పిజ్జాలు తినకూడదు. రాత్రి పూట శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల మాంసాహారం లాంటివి తింటే తేలిగ్గా జీర్ణం కావు. కొందరికి నిద్రపోయే ముందు ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. చిరుతిళ్లు తింటారు లేదా కాఫీలు, టీలు తాగుతారు. నిద్రపోయే ముందు ఏమైనా తినడం మంచి అలవాటు కాదు. అది జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది. అలాగే కాఫీలు, టీలలో ఉండే కెఫిన్ వల్ల నిద్ర సరిగా పట్టదు కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.