మన శరీరంలో చెవులు చాలా సున్నితమైన అవయవాలు. బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా వీటికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఈ చెవి ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ఇన్ఫెక్షన్ల కారణంగా చెవిలో నొప్పి కలుగుతుంది. చెవి పూడుకుపోయినట్లు ఉండడం, వినబడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఈ చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి ? వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మన శరీరంలో చెవులు చాలా సున్నితమైనవి. వీటికి ఏమైనా అయితే ప్రాణం విలవిలలాడిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా వీటికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెవుల్లో ఇన్ఫెక్షన్ సోకితే.. ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల కారణంగా చెవిలో నొప్పి కలుగుతుంది. చెవి పూడుకుపోయినట్లు ఉండడం, వినబడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవిలో ఇన్ఫెక్షన్స్ చాలా మందిలో సాధారణంగా వచ్చే సమస్య. చాలా సార్లు చెవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్య తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. చిన్నచిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్య కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. ఐతే దీర్ఘకాలికంగా వచ్చే ఇన్ఫెక్షన్లు త్వరగా సమసిపోవు.. ఒకవేళ తగ్గిపోయినా.. మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ. చెవి ఇన్ఫెక్షన్‌లకు అనేక కారణాలున్నాయి. జలుబు చేయడం, ముక్కుకు వచ్చే సమస్యలతోనూ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామందిలో జలుబు చేశాక చెవినొప్పి కూడా కనిపిస్తూ ఉండటం సహజం.
సాధారణంగా ముక్కుకు వచ్చిన ఇన్ఫెక్షన్లు చెవిలోకీ పాకుతాయి. అలాగే ముక్కుకు వచ్చే అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్లు కూడా చెవినొప్పిని కలిగిస్తాయి. కొద్దిమందిలో చెవులు సరిగ్గా వినిపించవు. దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లలోనూ సాధారణంగా ఇలాంటి సమస్యలే ఉంటాయి. కానీ వాటిని దీర్ఘకాలిక సమస్యలుగా మనం గుర్తించలేకపోవచ్చు.. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చెవి సమస్యలను గుర్తించడానికి వైద్యనిపుణులు ఓటోస్కోప్ పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉందా లేదా వ్యాక్స్ ఉందో తెలుసుకుంటారు. ఒక్కోసారి సమస్య తీవ్రతను బట్టి కొన్ని రక్తపరీక్షలు, సీటీస్కాన్ వంటి ఇతర పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్లను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. చెవికి ఎలాంటి ఎన్ఫెక్షన్లు ఉన్నా తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. వైద్యుల సలహామేరకు యాంటీబయాటిక్స్ లేదా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు వాడాలి.
చెవిలో ఇన్ఫెక్షలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
సాధారణంగా చెవినొప్పి జలుబు వల్లే ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి రెగ్యులర్ డైట్లో జలుబు వ్యాధినిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను తీసుకోవాలి. చెవి నొప్పి ఉన్నప్పుడు కొన్ని సున్నితమైన, సులభమైన వ్యాయామాలు చేస్తే ఇయర్ కెనాల్స్ తెరుచుకుంటాయి. చెవి నొప్పి ఉన్నప్పుడు షార్ప్ గా ఉన్నటువంటి వస్తువులను చెవిలో పెట్టకూడదు. కాటన్ ఇయర్ బడ్స్ లాటింవి చెవిలో వేసి తిప్పడం మంచిది కాదు. దీని వల్ల మరింత దుమ్ముచేరే అవకాశం ఉంది. చెవి పోటు రాగానే .. అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి మంచిది కాదు. చెవిలో సోకే ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి దీర్ఘకాలికంగా వినికిడి సమస్య వచ్చేందుకు కారణమవుతాయి. పిల్లల్లో అయితే మాటలు సరిగ్గా రాకపోవడం కూడా జరుగుతుంది. ఇన్ఫెక్షన్ల కారణంగా చెవిలో కర్ణభేరీ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెబుతున్నారు.
చెవిలో సోకే ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి దీర్ఘకాలికంగా వినికిడి సమస్య వచ్చేందుకు కారణమవుతాయి. కాబట్టి చెవులకు ఇన్ఫెక్షన్లు సోకితే వెంటనే ఈఎన్‌టి వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ చెవికి ఇతర సమస్యలు రాకుండా జాగ్రత్తపడండి.