గొంతులో గర..గర.. మంటూ దగ్గు వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా అసౌకైరానికి గురి చేస్తుంది. దగ్గును ఎదుర్కోవాలంటే దానికి మూలం ఎక్కడుందో గుర్తించటమే అన్నింటికన్నా కీలకం. అసలు ఇంతకీ దగ్గు ఎందుకు వస్తుంది ?దీనికి కారణాలు ఏంటి? దీని నుంచి బయట పడటానికి పరిష్కార మార్గాలేంటి..?
సాదారణంగా దగ్గు రానివారంటూ ఎవరూ ఉండరు. సీజన్ మారినప్పుడల్లా కొందరికి జలుబుతోపాటు దగ్గు కూడా వస్తుంటుంది. ఎప్పుడో అలా అరుదుగా దగ్గు వచ్చినా, ఎవరికీ ఆందోళనకరంగా ఏమీ అనిపించదు. కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు కూడా దగ్గు రావచ్చు కాకపోతే, కొద్ది రోజుల్లో లేదా ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది.
కొంతమందిలో ఈ సమస్య నెలలే కాదు ఏడాది గడచినా తగ్గకపోవచ్చు. నిజానికి ఈ రోజుల్లో ఎక్కువమంది డాక్టర్‌ను కలుస్తున్న ఒక పెద్ద కారణం ఈ దగ్గు సమస్యే. దగ్గు అనేది నిజానికి వ్యాధి లక్షణమే తప్ప వ్యాధి కాదు. అందువల్ల దగ్గు కారణాన్ని కనుక్కుంటే దగ్గుకు వైద్యం కనుకున్నట్లే అవుతుంది.
దగ్గు రావడానికి కారణాలు ఏంటి ?
కొంత మందిలో శ్వాసక్రియలో ఆటంకం ఏర్పడటం వల్ల నిరంతరం దగ్గొస్తుంది. ఎక్కువ ప్రయాణాలు చేసే వారు రోడ్డుపైన ఉండే దుమ్ము ,ధూళీ పీల్చడం ద్వారా కొన్ని బ్యాక్టీరియాలు ముక్కు ద్వారా లోపలికి చేరతాయి వాటిని బయటకి పంపించే ప్రయత్నంలో విపరీతమైన దగ్గు వస్తుంది. పొడి దగ్గు తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. దీనికి అస్ప్రత్రి మందుల కన్నా ఇంట్లోనే మనం చక్కని ఔషదాలు తయారుచేసుకోవచ్చు.
ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనెను తాగితే మంచి ఫలితం ఉంటుంది. తేనె గొంతు నొప్పిని తగ్గించటంలో మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. పొడి దగ్గు ఎక్కువగా వేధిస్తుంటే…. అల్లం టీ తాగితే తొందరగా ఉపశమనం పొందుతారు. దాంతో పాటు గ్రీన్ టీ గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే గొంతు గరగర తొందరగా తగ్గుతుంది. దగ్గు అధికంగా వస్తుంటే కొంచెం తలకు, గొంతుకు జండుబామ్ రాసుకుని కొద్ది సమయం విశ్రాంతి తీసుకున్నా మంచి ఫలితం పొందవచ్చు.
శరీరాన్ని ఏ సీజన్ లో అయినా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు నీరు ఒక ఉత్తమైన మార్గం. గోరువెచ్చని నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది. వేడిగా కాఫీ లేదా టీ లేదా వేడి వేడిగా మీకు ఇష్టమైన సూప్స్ తీసుకోవడం వల్ల దగ్గకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో చాలా పొడిబారి ఉంటుంది మరియు దగ్గు చాలా క్రమంగా పెరుగుతుంటుంది. అందుకు ఆవిరి పట్టిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అత్యధికుల్లో ఉండే పొగతాగే అలవాటు ఈ సమస్యకు ఒక పెద్ద కారణం. పొగతాగడం మానుకోవాలి. మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయడం తప్పనిసరి.
ఫ్యాటీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. భోజనం ఎప్పుడూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ అప్పటికీ ఉపశమనమూ కలగకపోతే, మీకు దగ్గు రావడానికి మరేదో కారణం ఉందని భావించాలి. ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి.
ఒకటి, రెండు రోజులుగా బాధిస్తుంటే జలుబు, ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్ల వంటివేమైనా ఉన్నాయేమో అనుకోవచ్చు. కానీ రోజులు, వారాల తరబడి దగ్గు వస్తుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. కచ్చితంగా కారణాలు ఏంటో తెలుసుకుని చికిత్స తీసుకోవటం అవసరం.