Health Tips: కడుపులో నులి పురుగులు పోవాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసం..!

By manavaradhi.com

Published on:

Follow Us
Nuli Purugulu

నులిపురుగులకు సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఏటా నులిపురుగులకు సంబంధించి నిర్మూలన దినోత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంది. నులిపురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారిలో నులిపురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యత ను మెరుగుపర్చే ప్రయోజనాలు కలుగజేస్తుంది.

ఎక్కువగా ఒకటి నుంచి పంతొమ్మిది ఏళ్ల పిల్లలు నులిపురుగుల సమస్య బారినపడే అవకాశం ఉంది. ఇవి పేగుల్లో ఉండే పోషకాలన్నింటినీ తినేస్తాయి. దీంతో శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఎంతతిన్నా కూడా పోషకాహారం శరీరానికి అందకుండా ఉంటుంది. ఆకలి సరిగ్గా వేయదు. ఎక్కువగా బలహీనంగా మారుతారు. తరుచుగా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. బరువు పెరగరు. చాలా మంది బక్కగా ఉండే వారు నులిపురుగుల సమస్య బారినపడి ఉంటారు. కానీ వారికి ఈ విషయం తెలియక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా వారు ఎంత తిన్నా కూడా లావుకారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బందులుపడుతుంటారు. తినే తిండిని మొత్తం కూడా నులిపురుగులు తినేస్తాయి. పిల్లలలో సాధారణంగా మూడు రకాల నులిపురుగులు కనబడే అవకాశం ఉంది. ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు ఉంటాయి.

ప్రధానంగా అపరిశుభ్రత వల్ల నులి పురుగులు వ్యాపిస్తాయి. పరిసరాలను శుభ్రంగా లేకుంటే ఇవి అక్కడ ప్రబులుతాయి. అలాగే గోర్లు పెద్దవిగా పెంచుకుని వాటిని క్లీన్ గా ఉంచుకోకపోతే కూడా నులిపురుగులు వ్యాపిస్తాయి. చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి. అలాగే పరిశుభ్రమైన నీరు తాగాలి. బహిరంగ ప్రవేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుకోవాలి. కూరగాయాలను శుభ్రమైన నీటితో కడగాలి. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడు మూతలు కప్పి ఉంచాలి.

నులిపురుగులను నిర్మూలించేందుకు అల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 400ఎంజీలో సగం 200 ఎంజీ మాత్రను వేసుకోవాలి. మిగతా వారు 400 ఎంజీ మాత్రను వేసుకోవాలి. మాత్రలు వేసుకున్న ఒకో రోజు లేదా రెండు రోజుల్లో నులిపురుగులు ఉన్నట్లయితే మల విసర్జన ద్వారా పురుగులు బయటకు వెళ్తాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు వేసుకోకూడదు. నులిపురుగులు ఉన్నవారు మాత్రలు వేసుకుంటే వికారం, వాంతులయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశముంది. దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నులిపురుగులు. పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీస్తాయి. కాబట్టి వీటి విషయంలో అశ్రద్ధ వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Leave a Comment