Fiber Rich Diet: డైట్​లో ‘ఫైబర్’ ఎంత తీసుకోవాలి? ఎక్కువైతే నష్టమా?

By manavaradhi.com

Published on:

Follow Us
Fiber Rich Diet:

అధిక ఫైబర్స్ కలిగిన ఆహారాలు మన రెగ్యులర్ డైట్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫైబర్ పనిచేసే విధానాన్ని బట్టి దాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి జీర్ణం అయ్యేది.. మరొకటి జీర్ణం కానిది. ఐతే ఈ రెండింటి వల్ల మనకు లాభమే. జీర్ణమయ్యే ఫైబర్ అనేది ఆహారంతో పాటు మెల్లగా జీర్ణమవుతూ ఉంటుంది. మెల్ల మెల్లగా జీర్ణం కావడం వల్ల మన శరీరంలోకి ఆహార పదార్ధాల నుంచి గ్లూకోజ్ కూడా నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. అంతే కాదు … మధుమేహం బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాదు రక్తంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ ను కూడా ఇది బయటకు తరిమేస్తుంది.

జీర్ణమయ్యే పీచు పదార్ధాలు తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగం. క్రమంగా బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఇక జీర్ణం కాని ఫైబర్ ఇది మన శరీరానికి అవసరం లేని పదార్ధాలను బయటకు పంపేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం బారిన పడకుండా ఉండేందుకు సహాయపడతాయి.

తృణ ధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. తాజా పండ్లలో మనకు ఎక్కువ మోతాదులో ఫైబర్ లభిస్తుంది. ఆపిల్ లేదా ఆరెంజ్ వంటి వాటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ల్ల ఇది ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది.

  • కాలీఫ్లవర్, క్యాబేజ్ మరియు బ్రొకోలీ వంటి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, గూస్బెర్రీస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, శరీరానికి అవసరమయ్యే ఫైబర్ బెర్రీస్ నుండి కూడా శరీరానికి అందుతుంది.
  • అవకాడో సాచురేటేడ్ ఫాట్’లకు బదులుగా మోనో-సాచురేటేడ్ ఫాట్’లను బదిలీ చేయుటలో శక్తివంతంగా పని చేస్తుంది. మరియు బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా అవకాడోని మీరు తీసుకునే ఆహారంలో కలుపుకోవటం వలన గుండెని ఆరోగ్యంగా ఉంచే ఫాట్’లను అందించినవారు అవుతారు.
  • ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మరియు ఫైబర్’లను కలిగి ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ బరువు నిర్వహణలో ముఖ్యపాత్రని పోషిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్’లు ఆకలిని తగ్గించివేస్తాయి మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ చక్కర పదార్థాలు తీసుకునే అవసరం లేకుండా చేస్తాయి.
  • మష్రుమ్స్ మనకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్సే.. ఇది చాలా ఆరోగ్యకరమైనది మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉన్నాయి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
  • రైస్ బ్రాన్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. రెగ్యులర్ గా శరీరానికి ఫైబర్ అందాలంటే రైస్ బ్రాన్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

మన ఆహారంలో ఆకుకూరలు ప్రధానంగా వుండాలి. ప్రతిరోజూ కాసిన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా వంటివి తినాలి.ఆహారంలో రోజుకు 40-45 గ్రాముల పీచు ఉండటం అవసరం. ఇందులో కరిగే పీచు ఎక్కువగా వుంటే మరీ మంచిది. పీచు అందరికీ అవసరమే అయినా, కొందరు ప్రత్యేకించి ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వుంటుంది. మలబద్ధకం, మధుమేహం, గుండెజబ్బులు, స్థూలకాయంతో బాధపడేవారు, మాంసాహారం తీసుకునేవారు తప్పకుండా పీచు ఎక్కువగా తీసుకోవాలి.

పీచు పదార్థాలు మన ఆరోగ్యానికి ప్రాణం లాంటివి. వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, మధుమేహం లాంటి వాటి నుంచి కాపాడతాయి. కాబట్టి దీనిపట్ల అవగాహనతో మంచి ఫైబర్ ఆహారాన్నీ తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవచ్చు.

Leave a Comment