Heart Health: మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Heart Health

మనం చేసే ప్రతి పని మన శరీరంలోని అన్ని భాగాల మీద ప్రభావం చూపుతూనే ఉంటుంది. ముఖ్యంగా మన జీవన విధానం మన గుండెను ఎంతో ప్రభావితం చేస్తుంది. జీవన విధానం సవ్యంగా లేకపోతే, భవిష్యత్ లో గుండె సమస్యలు ప్రాణాంతకంగా మారతాయి.

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. ఇది శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. దీంతో అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ప్రస్తుత తరుణంలో అస్తవ్యస్తమైన మన జీవన విధానంతోపాటు పలు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడి చనిపోతున్నారు. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. దీనికి తోడు.. నిత్యం వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి.

Healthy Food for Heart

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ఆహారం సమయానికి తీసుకోవాలి. ఎంత హెల్దీ ఫుడ్ అయినా టైం కి తీసుకోకపోతే అది మంచిది కాదు. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో చూసుకోవాలి.బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేసి గుండె ఆరోగ్యం గా ఉండేటట్లు చూడడంలో హోల్ గ్రెయిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్, న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. రెఫైండ్ గ్రెయిన్స్ బదులు హోల్ గ్రెయిన్స్ వాడితే హార్ట్ హెల్దీగా ఉంటుంది.

గుండె జబ్బులు తలెత్తేందుకు ఒత్తిడి అనేది ప్రధాన కారణంగా వ్యవహరిస్తుందని ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్ట్ లు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ను పాటించే వాళ్ళలో కూడా ఒత్తిడి వలన గుండె జబ్బుల సమస్య కనిపించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. కాబట్టి, ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానాలను తెలుసుకోవాలి. యోగా లేదా మెడిటేషన్ ను సాధన చేయాలి. తద్వారా, ప్రాణాంతకమైన గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. రోజులో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. ఇది గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. పెరిగే బరువు గుండె మీద భారాన్ని పెంచుతుందనే విషయాన్ని మరిచిపోవద్దు. కొన్ని ఓవర్ ది కౌంటర్ నొప్పి మందులు వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, మరియు గుండె సమస్యలతో ముడిపడి ఉన్నాయి. రోజువారీ నొప్పులకు ఏమి తీసుకోవాలో మీ వైద్యుడిని అడగండి. మీకు ఇప్పటికే గుండె జబ్బులు ఉంటే, శరీరానికి ఫ్లూతో పోరాడటానికి అంత బలం ఉండకపోవచ్చు. గుండెపోటు లేదా న్యుమోనియా వచ్చే అవకాశం ఉంది.కాబట్టి ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి.

Exercise for a Healthy Heart

గుండె ఆరోగ్యం కోసం ప్రధానమైనది జీవనశైలిని మార్చుకోవడమే. వీలైనంత వరకూ కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మందుగా వ్యాయామాన్ని మొదలు పెట్టాలి. రోజుకు కనీసం 30 నిముషాల పాటు శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాయామం ఒకేసారి చేయలేకపోయినా పూటకు 10 నిముషాల చొప్పున రోజుకు మూడు సార్లు చేసినా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే గుండెకు ప్రధాన శత్రువు అయిన పొగ తాగడం మానుకోవాలి.

సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 70 శాతం ఎక్కువ. పొగ తాగడం మానేసిన వెంటనే గుండె మరమ్మతు ప్రారంభం అవుతుంది. అదే విధంగా పరోక్ష ధూమపానం కూడా చాలా ప్రమాదకరం. వీలైనంత వరకూ పొగ తాగే వారికి దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉంటే ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. 30 ఏళ్ళు దాటినప్పటి నుంచి రెండేళ్ళకోసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

Leave a Comment