High Cholesterol – కొలెస్ట్రాల్ తగ్గించుకునే మార్గాలు

By manavaradhi.com

Published on:

Follow Us
High Cholesterol

మన శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పెరుకుపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. నిజానికి కొలస్ట్రాల్ లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను మనమే కొనితెచ్చుకుంటున్నాం. అంటే మనం చేసే తప్పిదాల వల్లే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతోంది.

ప్రతి ఒక్కరి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటాయి. రక్తంలో ఫ్యాట్ స్థాయినే కొలెస్ట్రాల్ అని వ్యవహరిస్తారు. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు ఎదురవుతాయి. ఐతే ఇది ఎంత మోతాదులో ఉండాలనేది వైద్యులు కొలెస్ట్రాల్ పరీక్ష చేసి చెబుతారు. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఇది అనారోగ్యకరమైన స్థాయిలో ఉంటే చెడు కొలెస్ట్రాల్ LDL అని .. ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటే మంచి కొలెస్ట్రాల్ HDL అని .. అని చెబుతారు.

మంచి కొలెస్ట్రాల్ అంటే రక్తంలో ఉండే సాధారణంగా ఉండే కొవ్వు శాతం అన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కొలెస్ట్రాల్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది దీన్ని సరిగ్గా పట్టించుకోరు. అలా నిర్లక్ష్యంగా చేసే పనుల వల్లే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి.. ప్రాణాంతకమైన గుండె సమస్యలకు దారితీస్తుంది….

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉన్నప్పటికీ పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి దీన్ని సాధారణంగా గుర్తించే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించుకోవడమే మార్గం. 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రక్త పరీక్ష చేయించుకోవాలి. కనీసం 4 – 6 ఏళ్ల మధ్య ఈ పరీక్ష చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకుని ఒకవేళ సమస్య ఉన్నట్లయితే వెంటనే చికిత్స ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలంటే .. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అలా అని రోజూ పెద్ద పెద్ద కసరత్తులు .. కిలోమీటర్ల మేర పరుగెత్తడం లాంటివి కావు . రోజూ కనీసం 40 నిముషాలపాటు వాకింగ్, స్విమ్మింగ్ , సైక్లింగ్ , డాన్సింగ్ లాంటివి చేస్తే చాలు . ఒకవేళ ఇలా చేయడానికి సమయం లేని వారు .. కనీసం 10 నిముషాలైనా వ్యాయామాలు చేస్తే మంచిది. దీని వల్ల కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ఆఫీసుల్లో సుదీర్ఘ కాలం కూర్చుని పని చేసే వారికి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల స్థూలకాయం వచ్చి.. క్రమంగా గుండె సమస్యలు , రక్తపోటు లాంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు నిత్యం గంటల తరబడి కూర్చునే ఉండడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అంతే కాదు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి ఆఫీసుల్లో పని చేసే వారు కనీసం అర గంటకోసారి కుర్చీలో నుంచి లేచి అటు ఇటూ వాకింగ్ చేయాలి. లేని పక్షంలో చేజేతులా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుకున్నట్లు అవుతుంది. .

ధూమపానం హానికరం .. ఇది కొలెస్ట్రాల్ కు కూడా వర్తిస్తుంది. పొగతాగేవారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోయి .. క్రమంగా రక్తపోటుకు దారి తీస్తుంది. ఆ తర్వాత మధుమేహం , గుండె సమస్యలు చుట్టుముడతాయి. పొగ తాగడం మానేస్తే .. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోయి… గుండె కవాటాలు ఆరోగ్యంగా ఉంటాయి. పొగ తాగని వారు కూడా .. ప్యాసివ్ స్మోకింగ్ కు దూరంగా ఉంటే మంచిది.. . అలాగే మద్యపానం కూడా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను శరీరంలో పెంచుతుంది. కాబట్టి మద్యానికి కూడా దూరంగా ఉంటే మంచిది.

ఆహారం విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా రక్షించుకోవచ్చు. ముఖ్యంగా తీసుకునే ఆహారాల్లో శ్యాచురేటెడ్ ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. రెడ్ మీట్ , అధిక కొవ్వు శాతం కలిగిన పాల ఉత్పత్తులు ,పామ్ ఆయిల్ లాంటి నూనెలు తగ్గించాలి . అలాగే ఎప్పటికప్పుడు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి . ముఖ్యంగా నడుం భాగంలో పేరుకుపోయి ఉన్న కొవ్వును తగ్గించుకోవాలి. లేని పక్షంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి.. వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే .. ఆహార నియమాలు తప్పకుండా పాటించడం అవసరం. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా.. నిత్యం వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక డైట్‌ని, వ్యాయామాన్ని పాటించే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకుని అనుసరించడం మంచిది.

Leave a Comment