Kitchen Tips: ఎక్కువ రోజులు నిల్వ చేయాలా? ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​!

By manavaradhi.com

Published on:

Follow Us
Kitchen Tips

ఆహారాన్ని నిలువ ఉంచుకునేందుకు ఒక్కోక్కరు ఒక్కోక్క పద్దతిని అనుసరిస్తారు. చాలా మంది ఏం తీసుకొచ్చినా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఫ్రెష్ గా ఉంటుందనుకుంటారు. అది మంచి పద్దతి కాదు. నిజానికి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మరికొన్ని ఆహార పదార్థాలు ఏ మాత్రం అందులో పెట్టకూడదు. ఎందుకంటే.. వాటివల్ల హానికలిగే అవకాశం ఉంది. చాలామంది ఫుడ్ మిగిలిన వెంటనే ఫ్రిడ్జ్ లో తోసేయడం ఒకఅలవాటుగా ఉంటుంది.

ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటబుల్స్, సాస్, సరుకులు కూడా కొంతమంది పెట్టేస్తుంటారు.అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏ ఆహారాలన్ని ఎలా నిల్వ ఉంచుకోవాలో తెలుసుకుని మరి భద్రపరుచుకోవాలి.

కూరగాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉన్నవి చాలానే ఉన్నాయి . వీని చల్లని వాతావరణంలో స్టోర్ చేసుకోవాలి. శరీరం చల్లగా ఉండాలంటే పెరుగును తప్పని సరిగా తీసుకోవాలి. అయితే పెరుగును సరిగా నిల్వచేయకపోతే త్వరగా పడావుతుంది.

పప్పు దినుసులు, సోయా, బీన్స్ జాతులకు చెందిన గింజలు కూడా ఎన్ని రోజులైనా పాడవ్వవు. వాటిల్లో పోషకాలు అలాగే ఉంటాయి. వీటిని ఎన్ని రోజుల పాటు అయినా నిల్వ చేయవచ్చు. అయితే పురుగులు పట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది.అలాగే గాలి, తేమ తగలదు కనుక పాలిథిన్ సంచుల్లోను ,అల్యూమినియం తగరంలోను ప్యాకింగ్ చేసిన ఆహారం కూడా సూక్ష్మజీవుల బారి నుండి రక్షింపబడుతుంది .

సరైన ఉష్ణోగ్రతలో ఆహారం ఉడికించకపోవడం, త్వరగా పాడై ఆహారం అపరిశుభ్రతకు గురి అవుతుంది. కనుక ఆహారం సరియైన ఉష్ణోగ్రతలో ఉడికించాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలోను హెచ్చుతగ్గుల వలన బాక్టీరియా పెరుగదల రెట్టింపు అవుతుంది.

Leave a Comment