Meditation – ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం

By manavaradhi.com

Published on:

Follow Us
Health through meditation

ఉదయం లేచినదగ్గరునుంచీ అన్నిరకాల అనుభూతులు, భావాలు, ఆలోచనలు పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మనసుపై పడుతుంది. దాంతో ఒత్తిడి, చికాకు మొదలై మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా సంబంధాలలో కోపతాపాలు, ఆరోపణలమధ్య ఇరుక్కుంటారు. వీటన్నిటి ప్రభావం మనసుపై చక్రంలా తిరిగినట్టు ఒకదానివల్ల మరొకటి ఏర్పడి ప్రమాదాల్లో చిక్కుకునేలా చేస్తాయి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది. అదే ధ్యానం. ఆ ధ్యానంలో ఏ ఆలోచనలూ ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై, ఓ పది నిమిషాలు అయినా ఉండగలిగితే చాలు.

ఒత్తిడిని నివారించడానికి ప్రతిరోజూ 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరు ఒత్తిడి నుంచి బయటపడుతారు. అంతేకాదు ఆందోళన స్థాయి తగ్గుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల కూడా విశ్రాంతి కలిగి శారీరిక, మానసిక ఒత్తిడి నుంచి కోలుకునేలా చేస్తుంది.ఆలోచనల నుంచి మనసును క్లియర్ చేయడమనే ప్రక్రియే మెడి బ్రీతింగ్ ప్ర‌క్రియ‌.

మన మనస్సు ఆందోళన నుండి విముక్తి పొందేలా ప్రశాంతత మరియు శాంతి ధ్యానం వల్ల కలుగుతుంది. ధ్యానంలో వచ్చే ఆనందం ద్వారా మనం ఆనందకరమైన, స్వచ్ఛమైన స్థితిని అనుభవించగలుగుతాము. ధ్యానం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక పరిశుభ్రతకు ఇది ఒక ముఖ్యమైన పద్ధతి. ధ్యానం ద్వారా దేహానికి అంతర్గత బలం చేకూరుతుందని నిపుణుల అభిప్రాయం.

ధ్యాన ముఖ్య ఉద్దేశ్యం మైండ్ ను ప్రశాంతంగా, ఆహ్లాదంగా వుంచుకోవడం. ఇది మన మనసులోని వివిధ అంశాలను గట్టిపరుస్తుంది. ఏ శబ్దం లేని ప్రదేశంలో ధ్యానించండి. ముందుగా కొద్ది కొద్ది సమయాలతో మొదలు పెట్టండి. పది నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు చేయండి. మన మనసు, శరీరం రెండు అనుసంధానించబడి శక్తి కలుగుతుంది. మన మైండ్ ను పాజిటివ్ ఆలోచనలవైపు మళ్ళించాలి. ధ్యానించేటపుడు ఎంత ప్రధానమైన పని అయినా సరే వదిలేయండి.

రోజులో ఎంతో కొంత సమయం మీకోసం కేటాయించుకోండి. ఏకాగ్రతతో ఎంతో కొంత సమయం ధ్యానం చేయండి. మీకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా 10 నిమిషాలు ధ్యానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపుతున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేయండి. ఇవి ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.

Leave a Comment