Rohit Sharma: రోహిత్‌ శర్మ కొడుకు పేరు ఇదే.. వెల్లడించిన రితికా

By manavaradhi.com

Published on:

Follow Us
Rohit Sharma Family

టీమ్‌ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటీవలే కోడుకు పుట్టిన విషయం తెలిసిందే… అయితే ఆయన సతీమణి రితికా సజ్జే అభిమానులకు ఒక చిన్న తీపి కబురు అందించింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తమ చిన్నారి పేరును వెల్లడించింది.

డిసెంబరులో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా అదే స్టైల్లో కుమారుడి పేరును రితికా వెల్లడించింది. నాలుగు క్రిస్మస్‌ బొమ్మలపై తమ పేర్లతో పాటు చిన్నారి పేరు కూడా రాసి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. తమ రెండో బిడ్డకు ‘అహాన్‌’ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. రితికా పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అహాన్ అనేది సంస్కృత పదం అహాహ్ నుంచి వచ్చింది. దీనికి మేల్కోలుపు, స్పృహ, అవగాహన అనే అర్థాలు ఉన్నాయి. విష్ణు మూర్తి అవతారానికి సంబంధించిన పేరు ఇది.. అలాగే కాంతి, వెలుగు అనే అర్థాల్లో కూడా అహాన్ పదాన్ని వాడతారు.

రితికాను రోహిత్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 13న వీరి వివాహం జరిగింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సమయంలోనే ఆ జంటకు మొదటి బిడ్డ జన్మించింది. 2018 డిసెంబరు 30న వీరి జీవితంలోకి సమైరా వచ్చింది. ఈ ఏడాది నవంబరు 15న రోహిత్‌ మరోసారి తండ్రయ్యాడు. ఈ శుభవార్తను ఆయనే స్వయంగా పంచుకున్నారు. తాజాగా రితికా కుమారుడి పేరును తెలపడంతో అభిమానులు మరింత ఖుషి అయ్యారు.

భార్య ప్రసవం కోసం తొలి టెస్టుకి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, పెర్త్ టెస్టు మూడో రోజున ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం కాన్‌బెర్రాలో ప్రైమ్ మినిస్ట్రర్స్ XI జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. ఈ మ్యాచ్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Leave a Comment