పులివెందుల: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 ఓట్లను ఒక కట్టగా కట్టేటప్పుడు అందులోనుంచి ఓ స్లిప్ బయటపడింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు.30 ఏళ్ల తర్వాత ఓటు వేసినందుకు సంతోషంగా ఉందని ఓటరు అందులో పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలను పోలింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిపై 6035 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా హేమంత్‌రెడ్డి 683 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు.
పులివెందులలో స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి 11 మంది పోటీపడగా 74 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై 6267