Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోతున్న చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.
రాజకీయంలో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే పవన్ కల్యాణ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సుమారుగా రూ. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి పవన్ కెరీర్ లో ఊహించని హిట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు మరో మూవీని కూడా పట్టాలేక్కించే పనిలో ఉన్నారట పవన్ కల్యాణ్. తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ సంస్థ లో.. ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొన్న లోకేష్ కనకరాజ్ గానీ.. లేదా వినోద్ గానీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే సెన్సేషనల్ న్యూస్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
అభిమానులు లోకేష్ కనకరాజ్ తో పవన్ కలయిక సెట్ కావాలని కోరుతున్నారు. ఈ కలయిక ఓజీ హిట్‌కు 100 రెట్లు ఇంపాక్ట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కొత్త ప్రాజెక్ట్ కోసంఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మరి పవన్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే దానిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది.










