బాలీవుడ్ స్టార్ వెటరన్ హీరో ధర్మేంద్ర చనిపోయినట్టుగా ఈరోజు ఉదయం నుంచి బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో, నిజమేనని అందరూ భావించారు. కొంతమంది తెలుగు సహా బాలీవుడ్ హీరోలు, అలాగే నటీనటులు, ఇతర టెక్నీషియన్లు సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో స్పందించారు.
కానీ, ఆయన చనిపోలేదని ఆయన కుమార్తె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మీడియా కంగారుపడి ఫాల్స్ న్యూస్ వ్యాప్తి చేస్తోంది. మా నాన్న ఆరోగ్యం బానే ఉంది. అలాగే, ఆయన రికవరీ అవుతున్నారు. అందరూ మా ఫ్యామిలీకి ప్రైవసీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా నాన్నగారు త్వరగా కోలుకోవడానికి ప్రార్థిస్తున్న అందరికీ థాంక్స్. మీ ఈషా డియోల్” అంటూ ఆమె స్పందించింది.
ఇక, ఇప్పుడు బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఆయనను వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన టీం అని చెబుతూ ఉన్నట్టుగా ఒక ప్రకటన అయితే వెలువడింది, కానీ టీంకి కూడా ఈ ప్రకటనకు సంబంధం లేదని చెబుతున్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవ్ ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం ఆయనకు బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఎక్స్‌టెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.








