Onion price: ఉల్లి కిలో రూ.1కు ధర పతనం

By manavaradhi.com

Published on:

Follow Us
Onion price

ఇప్పటికే పాత ఉల్లి నిల్వలు ఉండగా.. ఇప్పుడు కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో వాటి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మధ్యప్రదేశ్‌ లోని ఉల్లి రైతులు పెద్ద మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తోంది. అక్కడ ఉల్లి ధర కేజీ రూ.1కు పతనమైంది. మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో మంగళవారం కిలో ఉల్లి ధర రూ.2గా ఉంది. నేడు మాండౌన్సర్‌లో దాని ధర రూ.1కి పడిపోయింది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కొత్త, పాత ఉల్లిపాయల నిల్వలు ఒకేసారి మార్కెట్‌లోకి వచ్చిన నేపథ్యంలోనే మాల్వాతో సహా పలు ప్రాంతాల్లో ఉల్లిపాయల ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలలుగా తమ ఉత్పత్తులను నిల్వ చేసినప్పటికీ.. సరైన ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఉల్లి, వెల్లుల్లికి కనీస మద్దతు ధర ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Comment