Puri -Vijay Sethupathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో పూరి జగన్నాథ్(Puri Jagannadh) ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా కొనసాగుతున్న వారంతా కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందుకున్న వారే. కాని ప్రస్తుతం పూరి కాలం కలిసిరావటంలేదు.. వరుస ఫ్లాప్ లుతో సతమతం అవుతున్నారు… ఇలాంటి తరుణంలో మంచి హిట్ ఇచ్చి తన పెరును నిలబెట్టుకోవాలనుకుంటున్నారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభమైంది. అయితే తాజాగా సినిమా షూటింగ్ ముగిసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. బిచ్చగాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీతో పాటు వీటీవీ గణేష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తారని అందరూ భావించారు. పూరీ మార్క్ మిస్ కాకుండా ఆయన అనుకున్నట్టుగానే త్వరగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా,ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అందులో సినిమా షూటింగ్‌ని తాను ఎలా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి చెబుతూ ఉండడం కనిపిస్తోంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాని పూరీ జగన్నాథ్‌తో పాటు చార్మీ కౌర్, జేబీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిజానికి, పూరీ జగన్నాథ్‌కు సాలిడ్ హిట్ దొరికి చాలాకాలం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కంబ్యాక్ కోసం ఆయన అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబో అనగానే అందరి దృష్టి ఒక్కసారిగా ఈ సినిమా మీద పడింది. ఇక ఇప్పుడు ఆ అంచనాలను ఏమాత్రం మిస్ కాకుండా ఉండేందుకు పూరీ అండ్ టీం కష్టపడుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్.










