Samantha Wedding : టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని సద్గురు ‘ఈషా ఫౌండేషన్’ లో అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత – రాజ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఏడాది కాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఎక్కడికి వెళ్లిన ఇద్దరి కలిసి వెళ్లడం సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయడంతో వీరి రిలేషన్ ను కన్ఫమ్ అయింది.
సింపుల్ గా నిరాడంబరంగా రాజ్ ను వివాహం చేసుకుని ప్రేమను పెళ్లిగా మార్చుకుంది సమంత. అయితే సమంత పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు ఎవరని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాజ్ నిడిమోరు రాజ్ నిడిమోరు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో 1975 జన్మించారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన రాజ్ నిడిమోరు USAలో సాఫ్ట్ వేర్ లో కొనేళ్లపాటు ఉద్యోగం చేశారు. సినిమాల పట్ల మక్కువతో ఫిల్మ్ మేకింగ్‌లోకి అడుగుపెట్టారు. దర్శకత్వ శాఖలో అనుభవం గడించి 2002లో షాదీ.కామ్ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత డీ ఫర్ దోపిడీ అనే మరో సినిమాను డైరెక్ట్ చేసిన రాజ్ ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ లో అడుగుపెట్టి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆ సిరీస్ సూపర్ హిట్ కావడంతో ఫ్యామిలీ మాన్ సీజన్-2 ను తెరకెక్కించాడు. ఈ సిరీస్ లో సమంత నటించింది. ఈ సిరీస్ లో షూటింగ్ లో టైమ్ లోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది. ఆ ప్రేమ కాస్త ఈ రోజు పెళ్లిగా మారింది. ఎర్రచీర, రాజ్ క్రీమ్ – గోల్డ్ కలర్ కుర్తాతో చూడముచ్చటగా ఉన్నారు. ఈ మేరకు సమంత సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు.

సమంత-రాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. అందులో వీరు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వివాహ విధానం గురించి అందరూ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠమైన ప్రక్రియే ఈ ‘భూత శుద్ధి వివాహం’. లింగ భైరవి ఆలయాల్లో, ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు.. వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో వివరించింది.










