టాలీవుడ్ హిట్ కాంబినేషన్లలో ఒకటి హీరో విక్టరీ వెంకటేష్- డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరికి ఎప్పుడూ ఒక మ్యాజిక్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు, మనసుకి హత్తుకునే డైలాగ్స్, హాస్యం, ఎమోషన్స్ మిక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’లాంటి బ్లాక్బస్టర్లు ఇప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘హౌస్ నం47 (AK47)’ అనేది ఉప శీర్షిక. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించిన ఎన్నో పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటికి చెక్ పెడుతూ నేడు ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటినుంచి ప్రారంభమైనట్లు తెలుపుతూ వెంకటేశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో దీన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా పంచుకున్న ఫస్ట్‌లుక్ పోస్టర్లో వెంకటేశ్ సింపుల్లుక్లో మధ్యతరగతి వ్యక్తిగా ఆకట్టుకుంటున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించడం అంటే… అది ఒక అరుదైన ఫీస్ట్! గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ (2001) ఒక తరాన్ని అలరించింది. త్రివిక్రమ్ రైటర్‌గా, డైలాగ్స్‌తో వెంకటేష్ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ మిక్స్ అయి… ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మ్యాజికల్‌గా ఆకట్టుకుంది. ఇక ‘మల్లీశ్వరి’ (2004) కూడా కామెడీ, రొమాన్స్ ఎలిమెంట్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు కొట్టింది.









