పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దర్శకుడు సుజీత్(Sujeeth) కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘ఓజి’(OG) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఓజి యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఓజి సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజీత్‌కు కారు గిఫ్టుగా ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ కోసం ఏకంగా ఈయన ఖరీదైన ల్యాండ్ రోవర్ డిపెండర్ (Land Rover Defender)కారును కానుకగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఓజి సినిమా తర్వాత ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పనులలో బిజీగా ఉన్నారు, త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది అయితే డైరెక్టర్ సుజీత్ నానితో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా పూర్తి అయిన తరువాతనే ఓజి సీక్వెల్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.









