Dussehra 2023: తొమ్మిదవ రోజు 23.10.2023 – శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ

By manavaradhi.com

Updated on:

Follow Us

ఆశ్వయుజ శుద్ధ దశమి- (విజయదశమి), సోమవారము, తేది. 23.10.2023 దర్శన సమయం : మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 11 గంటలు వరకు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకరణ

అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ ।
సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గాదేవి చిరునవ్వులతో శ్రీరాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. చెరుకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరి దేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభములు కలుగును. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీ దేవి. అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీఅమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి.

Leave a Comment