Ali : ఆలీ వైసీపీలో ఉంటాడా..! లేక మళ్లీ టీడీపీ గూటికా? జనసేనుడి దగ్గరికా? రాజకీయాల్లో ఆలీ దారేది..?

By manavaradhi.com

Updated on:

Follow Us

ఆలీ గతంలో టీడీపీ తరఫున గుంటూరు నుంచి టికెట్ కన్ఫామ్ అయిపోయిందని కూడా టాక్ వినిపించా చివరికి అదేమీ జరగలేదు. టీడీపీ మోసం చేసిందని వైసీపీ గూటికి ఎన్నో ఆశలతో చేరాడు. ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లోనే ఆయన పోటీకి సై అన్నా కుదరలేదు. చివరకు వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. జగనన్న చెప్పిన మాటలు విన్న ఆలీ ఆశల్లో గాలిలో తేలాడు. ముందు ఎమ్మెల్సీ.. ఆ తర్వాత మంత్రి పదవి.. నా చుట్టూ కాన్వాయ్‌ ఇలా సినిమా కలలు కన్నాడు. ఇందుకు స్నేహితుడైన పవన్‌ కల్యాణ్‌ను కూడా వదులుకున్నాడు. వీరిద్దరి స్నేహం ఎలా ఉండేదంటే.. ఆలీ లేకుండా పవన్‌ సినిమా లేదు. అంతేకాదు ఆలీ లేకుండా నా సినిమా ఉండదు అని పవనే స్వయంగా చెప్పడం విశేషం. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు ఓటు కూడా మార్పించుకున్నాడు. గుంటూరు నుంచి ఎమ్మెల్యేగా టికెట్‌ ఆశిస్తున్న ఆలీకి దాదాపు చుక్కెదురైనట్టే. దీంతో ఆలీ ఏం చేయబోతున్నాడు.. మళ్లీ టీడీపీలోకి వెళతాడా? తిట్టినా.. కొట్టినా స్నేహితుడేగా అని పవన్‌ చెంతకు చేరుతాడా అనేది వేచి చూడాలి.

అలీ త్వ‌ర‌లో ప్రత్యక్ష రాజ‌కీయాల్లో రానున్నారా..? ఎమ్మెల్యేగా ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారా ? అంటే… 2019లో పోటీ చేసే అవకాశం రాకున్నాఅప్పటి నుంచి గుంటూరుకు టచ్ లోనే ఉన్న అలీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేయాలని ఆశపడుతున్నారు. ఈసారి ఎలాగైనా సరే పోటీచేసి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారట. అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచెయ్యాలని తన మనసులోని మాటను సీఎం జగన్ కు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు ఎక్కువ. అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ణయించేది ముస్లిం మైనారిటీలే కావడంతో ఆలీ ఈ సారి ఎలాగైనా ఇక్కడినుంచి భరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఆలీ తన ఓటును హైదరాబాదు నుండి గుంటూరుకు మార్పించుకున్నాడు. గుంటూరు నుంచి అసెంబ్లీలో అడుగు పెడదామని భావించిన ఆలీకి వైసిపి అధిష్టానం నుంచి హామీ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేయలేక.. ఎవరితో చెప్పుకోలేక పైచూపులు చూస్తున్నాడు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆలీ కూడా నన్ను మోసం చేసాడు అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విచారం వ్యక్తం చేయగా… దీనికి బదులుగా ఆలీ దురుసుగా తాను బాల నటుడిని అని ఎవరి దయాదాక్షిణ్యల మీద ఆధార పడవలసిన అవసరం లేదంటూ ఆలీ ఇచ్చిన రియాక్షన్‌… అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు స్నేహితుల మధ్య దూరాన్ని కూడా పెంచాయి. అప్పటివరకు నా సినిమాలో ఆలీ లేకుండా ఒక్క సినిమా కూడా విడుదల చేయను అన్న పవన్‌ కళ్యాణ్‌…. ఇప్పటివరకు ఒక్క చిత్రంలో కూడా ఆలీకి అవకాశం ఇవ్వలేదు…. తెలుగుదేశం, జనసేనల మీద ఆరోపణల అనంతరం.. ఆలీకి రాజ్యసభ సీటు పక్కా అనుకున్నారు. దురదృష్టవశాత్తు ముఖేష్‌ అంబానీ మిత్రుడికి.. రాజ్యసభ సీటు కన్ఫర్మ్‌ చేయాల్సి వచ్చింది. ఆలీకి మొక్కుబడిగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టారు. వైసీపీ చేపట్టిన బస్సు యాత్రలో ఆలీ చురుగ్గా పాల్గొంటున్నాడు. 2019లో టికెట్‌ ఆశించి.. బంగపడినా 2024లో తప్పకుండా పోటీ చేయాలను దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైసిపి ఆయన కలను నెరవేర్చకపోతే తెలుగుదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.! అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో జగన్ తోనే ఉంటారా లేక ఎమ్మెల్యే టిక్కేట్ కోసం తిరిగి తెలుగుదేశం గూటికి చేరుకుంటారా… అన్నది వేచి చూడాలి.

Leave a Comment