ఏపీలో షర్మిల ఎజెండా ఏమిటీ? రేపు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేస్తుందా లేదా పొత్తులు పెట్టుకుంటుందా? ఎవరి ఓటు బ్యాంక్‌కు గండి పడనున్నది? జగన్‌కు పక్కలో బల్లెమేనా? ముందుగా కాంగ్రెస్ నేతలతో జిల్లాల వారీగా భేటీ అయిన తరువాత జనంలోకి వెళతానంటున్న షర్మిల రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం…!
తెలంగాణాలో పార్టీ స్థాపించినా గత ఎన్నికల్లో పొటి చేయకుండా ఎన్నికల అనంతరం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక్కడినుంచే అసలైన ఆట మొదలైంది .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలోని షర్మిల అడుగుపెట్టదు ఎందుకంటే విజయమ్మ అన్నా చెల్లెలు మధ్య సయోధ్య కుదిరించింది… ఎంతైనా అన్న చెల్లిలు కథ అన్నను అండగా ఉంటుంది తప్పు అన్నకు ఎదురుదిరగదు అన్న వైసీపి నేతలకు షర్మిల పెద్ద షాక్ ఇస్తూ ఏపీ రాజకీయాలోకి అగుపెట్టింది… దీంతో పేటీఎం బ్యాచ్ కూడా ఏంచేయాలో తొచక సతమతమౌతుంది…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిలా ఆట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన తర్వాత షర్మిలా రాజకీయ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అంది వచ్చిన అవశాన్ని అందిపుచ్చుకుంటూ షర్మిల కాంగ్రెస్‌లో ముఖ్య నాయకురాలు అవడమే కాదు ఏకాంగా ఏపీసీసీ పగ్గాలు కూడా చేపట్టింది. దీంతో జాతీయ స్థాయి నాయకుల్లో కూడా కొంత మేర చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తెగా అందరి మన్ననలు అందుకుంది. అందివచ్చిన అవకాశంగా తన కుమారుని వివాహం వేడుక కూడా తనకు కలిసి వచ్చింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను స్వయంగా ఆహ్వానించి వైయస్ రాజశేఖర్ రెడ్డి మార్కు రాజకీయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది. దీంతో వైసీపిలో అసహనంగా ఉన్న నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూసేలా చేస్తుంది.
షర్మిలా ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా తన సొంత అన్న పార్టీ అయిన వైసీపీపై ఘాటైన విమర్శలు చేసింది. అంతే కాదు ఏకంద అన అన్నను జగన్ రెడ్డి అంటూ సంబొదిస్తూ…. తన ప్రసంగాన్ని ప్రారంభించింది .. దీంతో అక్కడ ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఈలలు, కేకలు వేస్తు మరింత ఉత్సాహపరిచారు.. అంతే.. జగన్ పాలనపై ఘాటైన విమర్శలు చేస్తూ చీల్చి చెండాడింది. అయితే అన్నా చెల్లెల మధ్య నడుస్తున్న ఈ యుద్ధంలో…. విజయమ్మ నలిగిపోతున్నట్లు.. విశ్వసనీయ వర్గాల సమాచారం…. ఇరువురికి సర్ది చెప్పలేక.. చేసేదిలేక… లోలోపల… తీవ్ర కలత చెందుతున్నారు…!
పిసిసి అధ్యక్షురాలుగా మొదటి స్పీచ్ లోనే ఫుల్ మార్కులు కొట్టేసింది షర్మిల. గత 10 సంవత్సరాలలో టీడీపీ, వైసీపీ పార్టీలు 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ముంచేశాయి అని ఆరోపించారు. జగన్‌రెడ్డి మూడు రాజధానులు అంటూ రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు… దాచుకోవడం.. దోచుకోవడమే లక్ష్యంగా 5 సంవత్సరాల పాలన సాగించారని మణిపూర్‌లో 2 వేల చర్చిలను ధ్వంసం చేసినా.. జగన్‌రెడ్డి క్రైస్తవుడిగా ఒక్కసారైనా ఆ ఘటనపై మాట్లాడలేదు అంటూ దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన నా లక్ష్యం.. ఏపీ నాకు పుట్టినిల్లు, తెలంగాణా నాకు మెట్టినిల్లు.. రెండు రాష్ట్రాల్లో పనిచేసే హక్కు నాకున్నది. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాను.. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉన్నతమైంది. అందులో పనిచేయడం అదృష్టం.. కాంగ్రెస్‌లో ఉన్న పెద్దలను కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తా.. ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయాలన్నదానిపై అధిష్టానం సూచన మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా.. ముఖ్య నేతలను కలిసిన తర్వాత ప్రజల్లోకి వెళాతాను అంటున్నారు షర్మిల. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు ఎత్తిచూపారు.
ఆంధ్రలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక, మద్యం మాఫియానేనని.. దోచుకోవడం, దాచుకోవడమే. అభివృద్ధి జరగడం లేదు గానీ.. దళితులపై దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగలేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు రూ.లక్ష కోట్లు. చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేస్తే, ప్రస్తుతం సీఎం జగన్‌రెడ్డి రూ.3 లక్షల కోట్లకు పైగా చేశారు.. మొత్తంగా రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారు. కార్పొరేషన్ రుణాలు, ఇతర బకాయిలతో కలిపితే రూ.10 లక్షల కోట్లు అప్పుచేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు.? పదేళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? రోడ్డు వేయడానికి కూడా నిధుల్లేని పరిస్థితి. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదు. తాను కాంగ్రెసలో చేరితే ఏ పార్టీకి కీడు జరుగుతుందో తనను అడగడం కంటే ప్రజలను అడిగితే వారే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.