Sujeeth: ‘ఓజీ’ రూమర్స్.. సుజీత్ పోస్ట్ వైర‌ల్‌

By manavaradhi.com

Published on:

Follow Us
Director Sujeeth react on social media rumours

ఈ క్రమంలో.. దర్శకుడు సుజీత్‌ సోషల్‌ మీడియాలో మంగళవారం పోస్టు చేసిన ఓ నోట్‌ వైరల్‌గా మారింది. ‘ఓజీ’ విషయంలో తనను నమ్మి, ఎంతగానో సపోర్ట్‌ చేశారంటూ నిర్మాత డీవీవీ దానయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఓజీ’ గురించి చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, సినిమాని ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. నా నిర్మాత, టీమ్‌ ఇచ్చిన మద్దతు గురించి మాటల్లో చెప్పలేను’’ అని పేర్కొన్నారు. సుజీత్‌ సడెన్‌గా ఈ పోస్టు పెట్టడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. నిర్మాత దానయ్య, సుజీత్‌కు నిర్మాణ పరంగా విభేదాలు తలెత్తాయని ఇటీవల రూమర్స్‌ వచ్చాయి. దానిపైనే ఆయన ఇలా రియాక్ట్‌ అయి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘ఓజీ’ చిత్రీకరణ దశలోనే.. నాని హీరోగా సుజీత్‌ ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఓజీ’ ప్రొడక్షన్‌ హౌస్‌ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపైనే దాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. కానీ, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో, దానయ్య- సుజీత్‌ల మధ్య దూరం ఏర్పడిందంటూ వార్తలొచ్చాయి.

Leave a Comment