Kantara 1: ‘కాంతార చాప్టర్‌ 1’ వాయిదా..? వార్తలపై స్పందించిన టీమ్‌

By manavaradhi.com

Published on:

Follow Us
Kantara: Chapter 1

‘కాంతార చాప్టర్‌ 1’ వాయిదా పడనుందంటూ గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వరుసగా వస్తోన్న వార్తలపై టీమ్‌ స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’. 2022లో విడుదలై అంచనాలకు మించి చక్కటి విజయాన్ని అందుకున్న ‘కాంతార’కు ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై చిత్రబృందం స్పందించింది. అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల చేస్తామని వెల్లడించింది.

ఇప్పటికే తాముప్రకటించిన అక్టోబరు 2నే ‘కాంతార 1’ బాక్సాఫీసు ముందుకొస్తుందని స్పష్టం చేసింది. మేము అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్‌ పూర్తి చేస్తున్నాం. మా ప్రణాళికలకు తగినట్లే షూటింగ్‌ జరుగుతోంది. అక్టోబర్‌ 2న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలవుతుంది. మమ్మల్ని నమ్మండి. వేచి ఉండడం ఎంత విలువైనదో మీకే అర్థమవుతుంది. ఈ సినిమాపై వస్తోన్న ఊహాగానాలకు దూరంగా ఉండండి. అలాగే అనధికారిక ప్రకటనలను షేర్‌ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని చిత్రబృందం ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

Leave a Comment