Nani x Sujeeth : సుజిత్ నెక్ట్స్ సినిమా … నాని తోనా..!

By manavaradhi.com

Published on:

Follow Us
Nani x Sujeeth will start after The Paradise

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు సుజిత్.కేవలం రెండంటే రెండే సినిమాల అనుభవం ఉన్న ఇతను పవర్ స్టార్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాపై అంచనాలు ఓ రెంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే సుజీత్ నెక్ట్స్ సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా ఉండబోతుందని ఎప్పటినుండో వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల ఈ సినిమా ఆగిపోయిందని సుజిత్ ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ నానికి నచ్చలేదాని అందుకె ఈ సినిమాకు పక్కన పెట్టారని టాలీవుడ్ లో వినిపించాయి. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం సుజీత్ నెక్ట్స్ సినిమా నానితోనే ఫిక్స్. ఇందులో ఎలాంటి మార్పు లేదు. OG సినిమాను నిర్మిస్తున్న DVV ఎంటర్టైన్మెంట్స్ లోనే దానయ్య నిర్మాతగా ఈ సినిమా రాబోతుంది. అటు ది ప్యారడైజ్ ను ముగించి సుజిత్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు నాని.

నాని ప్యారడైజ్ 2026 మార్చి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సుజిత్ సినిమా సెట్స్ మీదకు వెళ్తే మాత్రం ఆ మూవీ మరో ఏడాది పడుతుంది. సుజిత్ తో సినిమా అంటే ఈసారి పాన్ ఇండియా బొమ్మ అన్నట్టే. ఎలాగు ఓజీతో డైరెక్టర్ గా సుజిత్ తన మార్క్ చూపిస్తాడు కాబట్టి నానికి సుజిత్ తో సినిమా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచు. నాని ప్యారడైజ్ తర్వాత సుజిత్ మాత్రమే కాదు హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో కూడా ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది. నాని సినిమాల ప్లానింగ్ తో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాడు. సుజిత్ కూడా ఓజీ తర్వాత మరీ లేట్ చేయకుండా నెక్స్ట్ సినిమా వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

Leave a Comment