OG Update: ‘ఓజీ’ కోసం 117 మంది సంగీత కళాకారులు..!

By manavaradhi.com

Published on:

Follow Us
OG Latest Update

సుజీత్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ఓజీ’ రూపొందుతోంది. ఇందులో పవన్‌ కళ్యాణ్ ఇప్పటివరకూ ఎన్నడూ చూడని పాత్రలో ఓజాస్‌ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంకా మోహన్‌ నటించారు. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌. శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్‌దాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం దీని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘ఓజీ’ (OG) ఒకటి. సెప్టెంబర్‌ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే.. కొన్ని రోజులుగా వరుస అప్‌డేట్‌లు, పోస్టర్లతో సోషల్‌ మీడియాలో చిత్రబృందం సందడి చేస్తోంది. తాజాగా తమన్‌ ఓ మ్యూజికల్‌ అప్‌డేట్‌ పంచుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా కోసం జపాన్‌ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి బీజీఎం క్రియేట్‌ చేసినట్లు తెలిపిన ఆయన తాజాగా మరో పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు. లండన్‌లోని స్టూడియోలో దీని రికార్డింగ్‌ పనులు జరుగుతున్నట్లు తమన్‌ తెలిపారు. 117 మంది సంగీత కళాకారులు దీనికోసం వర్క్‌ చేస్తున్నట్లు చెప్పారు. నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చిందన్నారు. తమన్‌ పోస్ట్‌తో #HungryCheetah హ్యాష్‌ ట్యాగ్‌ మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Leave a Comment