మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి రక్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అంటే….విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్స్ మొదలైనవి. ఇవి మనలో గుండెపోటు, కేన్సర్, పక్షవాతం, కేటరాక్ట్, కీళ్ళనొప్పులు, అల్జీమర్ వ్యాధి మొదలైన వ్యాధులను అరికడతాయి.యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. మన శరీరానికి ఇంతలా ఉపయోగపడే …యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మన ఆహారంలో భాగం చేసుకుందాం.
మన ప్రతి జీవకణంలోనూ ప్రతిరోజూ జరిగే జీవక్రియల్లో కణానికి కొంత నష్టం జరుగుతుంది. దీన్ని సెల్ డ్యామేజ్ అని అభివర్ణిస్తారు. యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల సెల్ డ్యామేజ్ తగ్గడమే కాకుండా, కణానికి తగిలే దెబ్బలను యాంటీఆక్సిడెంట్స్ రిపేర్ చేస్తాయి. మనం తీసుకునే ప్రధాన ఆహారానికి తోడుగా యాంటిఆక్సిడెంట్స్ ఉన్న ఆహాలు నిత్యం తీసుకుంటే మంచి ఆరోగ్యం సమకూరుతుంది. మనకు తెలిసినంత వరకూ యాంటిఆక్సిడెంట్స్ ఆహారాలు చాలానే ఉన్నాయి.
- గ్రీన్ బెల్ పెప్పర్ లో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి. వివిధ రకాల క్యాన్సర్లను నిరోధించే వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది. అందుకే చాలా వరకూ క్యాన్సర్ పేషంట్స్ ను ఈ బెల్ పెప్పర్స్ తినమని సలహా ఇస్తుంటారు. బెర్రీస్ లో సిట్రస్ ఆమ్లం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.
- వెల్లుల్లి యాంటిబయోటిక్ లక్షణాలు కలిగినదని మనందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఎ, బి, మరియు సి, సెలీనియం, ఐరన్, జింక్ మొదలగునవి ఫుష్కలంగా ఉండి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది.
- డార్క్ చాక్లెట్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు మనకు అధికంగా లభిస్తాయి. డార్క్ గా ఉండి మరియు తీపిలేని కోక ఉన్న చాక్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇవి శరీరంలోని మలినాలను శుభ్రపరచడానికి బాగా సహాయపడుతుంది.
- గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక గుడ్డులో కంప్లీట్ న్యూట్రీషియన్స్ ఉంటాయి. గుడ్డులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి బాగా సహాయపడుతాయి.
- రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు. అది నిజం. ఆపిల్స్ లో ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అది శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
రెడ్ బెల్ పెప్పర్ లో అధికంగా కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రెడ్ మరియు ఎలో బెల్ పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది ఇందులో న్యూట్రిషియన్స్ పుష్కలం లభిస్తాయి. టమోటోల్లో, రెడ్ బెల్ పెప్పర్ లో లాగే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఎర్రగా ఉండే కూరగాయలు, పండ్లలో లైకోపిన్ అధికంగా ఉంటుంది. అందుకే ఇవి క్యాన్సర్ తో పోరడే గుణాలు చాలా ఉంటాయి.
అవొకాడోలో విటమిన్స్, ఎ, సి మరియు ఇ పుష్కలంగా ఉండి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది. లవంగాలు వంటల్లో సువాసననిచ్చే వస్తువు మాత్రమే కాదు. ఇందులో ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణకు బాగా ఉపయోగపడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గ్రీన్ వెజిటేబుల్స్ బ్రొకోలిలో కూడా అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధులతో పోరాడే ఫోలీన్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న ఫోలిఫినాల్స్ నుండి యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ ఫ్యాట్ మెటబాలిజానికి సహాయపడుతుంది. మీ రెగ్యులర్ ఆహారంతో పాటు ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను తీసుకొని మీ ఆరోగ్యాన్ని అందమైన సౌందర్యాన్ని, చక్కటి శరీర ఆక్రుతిని పొందండి.