Lemons and Limes : నిమ్మకాయ‌తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!

By manavaradhi.com

Published on:

Follow Us
Healthy uses of Lemons and Limes

నిమ్మ కాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతుంటాయి. చాలా మంది నిమ్మరసాన్ని వంటలలో రుచికోసం ఎక్కువగా వాడుతూంటారు. అంతేకాదు నిమ్మకాయల్లో అనేక రకాల ఔదషధ కూడా దాగిఉన్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం పొందవచ్చు. మనం తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి.

నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి ఆహారం జీర్ణం కావటానికి దోహదం చేస్తాయి. మనలో చాలామంది తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు.

నిమ్మకాయలో లభించే విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాదు గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి కాపాడతాయి. నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుంది.


రక్తపోటుపై ఉప్పు చూపే ప్రభావాన్ని తగ్గించటానికీ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది సహజంగా యాసిడ్ గుణాన్ని కలిగి ఉన్నా శరీరంలోకి వెళ్లగానే ఆల్కలైజింగ్ ఏజెంట్‌గా మారుతుంది. కనుక నిమ్మ రసాన్ని ఎవరైనా నిర్భయంగా తాగవచ్చు. దాంతో శరీర ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.

చర్మ కాంతిని పెంచే ఔషధ గుణాలు కూడా నిమ్మరసంలో ఉన్నాయి. వయస్సు మీద పడుతుండడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఆ లక్షణాలను దూరం చేసే యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది.

నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం పోతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు మాయమవుతాయి. బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి. తల తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు, శరీరంలో లవణాలు బాగా తగ్గినప్పుడు నిమ్మరసం ఇస్తే త్వరగా కోలుకుంటారు. జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసంతోపాటు, పళ్లరసాలు ఇస్తే ఆ తీవ్రత త్వరగా తగ్గుతుంది.

కేవలం కొన్ని నిమ్మకాయలు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మీరు వీటిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, అంటే వీటిని వంట్లల్లో, నిమ్మ రసం లేదా లేమోనైడ్ రూపంలో తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుకుంద్దాం.

Leave a Comment