Kharbuja Benefits : ఖర్బూజ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

By manavaradhi.com

Published on:

Follow Us
Health Benefits of Muskmelon (Kharbuja)

ఖర్బూజ పండులో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. కాబట్టి శరీర తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. వీటిలో వున్న పోషక విలువలు … అలాగే ఖర్బూజ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.

ఖ‌ర్బూజ పండ్లు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు అందిస్తుంది. శ‌రీరానికి అనేక రకాల పోషకాలు ల‌భిస్తాయి. కర్బూజాలో అత్యధికంగా 92 శాతం నీరు ఉంటుంది. అందుకే ఈ పండు అంటే.. చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడతారు. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది. కర్బూజాలో విటమిన్‌ A, విటమిన్‌ C పుష్కలంగా ఉంటాయి.

ఈ పండులో పోషకవిలువలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ ‌ను బ్యాలెన్స్‌ చేస్తాయి. బరువు తగ్గడానికి కర్బూజాలో అతితక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే కర్బూజా విత్తనాల్లో కూడా పొటాషియం ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది. తరచూ కండరాలు పట్టేసేవాళ్లు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వీటి రసాన్ని తాగడంవల్ల మెదడుకి ఆక్సిజన్‌ సరఫరా బాగుంటుంది. దాంతో ఒత్తిడి తగ్గుతుంది. చక్కగా నిద్రపడుతుంది.

కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజ సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్‌ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. హై బ్లడ్ ప్రెజర్ తగ్గించటంతో పాటు రక్తంలోని చక్కెరశాతాన్ని బ్యాలెన్స్‌ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఒక కప్పు కర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్‌ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరి చేరవు.

కర్బూజ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. అజీర్తి, ఎగ్జిమా, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు కర్బూజా చక్కటి పరిష్కారం. కర్బూజ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. కర్బూజలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి.. ఎవరైనా.. నిర్మొహమాటంగా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

చర్మసౌందర్యానికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. నెలసరి సమయంలో నొప్పి, అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు ఖర్బూజ పండు తింటే ఆ సమస్యలు ఇట్టే తగ్గుతాయి. వీటిలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదులకు తోడ్పడుతుంది. కర్బూజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేయడానికి, ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.

కర్బూజాలో అత్యంత ఎక్కువగా ఉండే విటమిన్ సి.. ఎలాంటి అల్సర్స్ నైనా నివారించడానికి సహాయపడుతుంది. మస్క్ మిలాన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నరాలు, కండరాలను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల.. చాలా రిలాక్స్ గా నిద్రపడుతుంది .కొంద‌రు వీటి ముక్క‌ల‌పై చక్కెర‌, ఉప్పు, కారం వంటివి చ‌ల్లుకుని తింటారు. ఇక వీటితో కొంద‌రు జ్యూస్ చేసుకుని తాగుతారు. అయితే ఎలా తిన్నా ఖ‌ర్బూజ మ‌న శ‌రీరానికి మేలు చేస్తుంది.

Leave a Comment