ఓట్స్ మంచి పౌష్టికాహారం. దీనిలోని పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధిక మోతాదులో ఉన్నాయి. అలానే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతాయి. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వలన మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. ఇవి తినడం వలన చాలా లాభాలు వున్నాయి.
చలికాలంలో ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటితో జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. అందుకే శీతాకాలంలో అల్పాహారంగా ఓట్‌మీల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్స్ లో పీచు శాతం ఎక్కువ. కొవ్వు సమస్య ఉండదు. బరువు తగ్గించుకోవడానికి ఆహారనియమాలు పాటించేవారు ఓట్ మీల్‌తో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా వుంటాయి. పరీక్షల సమయంలో పిల్లలకు కప్పు ఓట్ మీల్‌లో కొంచెం తేనె కలిపి ఇస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
బ్లడ్ కొలెస్ట్రాల్ నిర్ణీత స్థాయిలో ఉంచుతూ.. గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయి. మంచి ఫైబర్ కంటెంట్ ఇందులో ఉంటుంది. ఓట్‌మీల్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడంవల్ల అధికరక్తపోటు నియంత్రణలో వుంటుంది. ఓట్స్‌లో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తాయి. బరువు తగ్గానికి అవకాశముంటుంది.
ఓట్స్ లో ఎలాంటి పోషకాలు లభిస్తాయి…?
40 గ్రాముల ఓట్స్‌లో ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం ఎంతగానో తోడ్పడుతుంది. తద్వారా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం ఎంతగానే తోడ్పడుతుంది.
ఓట్స్‌లో ఉండే బీటా కెరోటిన్ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది. అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వలన చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.ఓట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి.
ఓట్స్ ఎవరు .. ఎంత మోతాదులో తీసుకోవాచ్చు…?
ఒక కప్పు వోట్మీల్ అనేది మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన ధాన్యపు అల్పాహారం అని చెప్పవచ్చు. తృణధాన్యాల గింజలు అయిన వోట్స్ లో ప్రోటీన్,ఇనుము,మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫోలేట్, మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి. అంతేకాక, మీ ఆరోగ్యానికి అవసరమైన శక్తివంతమైన ఫోటో న్యూ త్రియంత్స్ మరియు యాంటీఆక్సిడాంట్స్ ఉంటాయి. ప్రతిరోజూ ఆహారంలో ఓట్స్ ను తీసుకోవడం వల్ల నడుము చుట్టుకొలత తగ్గుతుంది. జీవక్రియల రేటు పెరుగుతుంది. ఇవి సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని జీవక్రియల రేటును పెంచడానికి.. అనేక అనారోగ్యాలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించడానికి చక్కగా తోడ్పడతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
కేవలం ఓట్స్ ని మాత్రమే తినడం వల్ల మన శరీర వ్యవస్థలు నియంత్రణలో ఉండవు. జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. కంటినిండా నిద్ర, పోషక విలువలుండే కూరగాయలు, పండ్లు తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లైతే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నేటి నుంచి మీరు ఆహారంలో ఓట్స్ ను భాగం చేసుకోండి. వోట్మీల్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి,నట్స్,పండ్లు లేదా మసాలా దినుసులను జోడించండి. అయితే,ఎక్కువ చక్కరను జోడించవద్దు. దానికి బదులుగా, రుచిని పెంచటానికి సహజమైన రుచులు అయిన పండ్లు,మసాలాను జోడించండి.