Iron Rich Foods: మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
iron food sources

ఐరన్‌ ఒంట్లో తగినంత లేకపోతే శరీరం చతికిల పడిపోతుంది. హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్‌ అనే ప్రోటీన్ల తయారీకిది అత్యంత అవసరం. మనం శ్వాస ద్వారా పీల్చుకునే ఆక్సిజన్‌ను ఎర్ర రక్తకణాలు అన్ని అవయవాలకు చేరవేస్తుంటాయి కదా. ఈ ప్రక్రియలో ఎర్ర రక్తకణాలకు సాయం చేసేది హిమోగ్లోబినే. ఇక మయోగ్లోబినేమో కండరాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంటుంది. హార్మోన్లు, కండర బంధనాలు, ఇతర అనుసంధాన కణజాలాల తయారీకి సైతం ఐరన్‌ తోడ్పడుతుంది.

శాకాహారులకు ఐరన్‌ లోపం ముప్పు ఎక్కువ. మాంసం, చేపలు, చికెన్‌ వంటివి తక్కువగా లేదూ పూర్తిగా తిననివారిలో దీని లోపం అధికంగా కనిపిస్తుంటుంది. పురుషుల్లో కన్నా మహిళల్లో.. ముఖ్యంగా నెలసరి ఆరంభమైన తర్వాత, గర్భధారణ సమయంలో ఐరన్‌ లోపం తలెత్తే అవకాశముంది. అంతేకాదు, వృద్ధుల్లో తిండి తినటం తగ్గుతున్నకొద్దీ ఐరన్‌ స్థాయులూ తగ్గుతుంటాయి.ఆడవారికి మరింత ఎక్కువే కావాలి మగవారికైతే రోజుకు 8 మి.గ్రా. ఐరన్‌ అవసరం. అదే ఆడవారికైతే ఎక్కువే కావాలి. ఆడవారిలో దీని అవసరం వయసులను బట్టి ఆధారపడి ఉంటుంది.

ఐరన్ ఎక్కు వగా లభించే ఆహారాలు

శాకాహారులు మరింత ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, జంతు కాలేయం, చేపలు, పీతలు, రొయ్యలు, చికెన్, చిక్కుళ్లు, శనగలు, ఉలవలు, రాజ్మా, సోయాబీన్స్, పప్పులతో పాటు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. ప్రస్తుతం ఐరన్‌ను జతచేసిన బ్రెడ్, అల్పాహారాల వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. కాకపోతే మన శరీరం జంతు ప్రొటీన్‌ పదార్థాల్లోని ఐరన్‌ను తేలికగా గ్రహిస్తుంది. అదే కూరగాయలు, ఆకుకూరల్లోని ఐరన్‌ను అంతగా శోషించుకోలేదు.

మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు మరింత ఎక్కువ మొత్తంలో.. అంటే మగవారు ఆహారం ద్వారా రోజుకు 14 మి.గ్రా., 19-50 ఏళ్ల మహిళలు 32 మి.గ్రా. ఐరన్‌ను లభించేలా చూసుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు. అలాగే విటమిన్‌ సితో కూడిన నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీలు, బ్రకోలీ వంటివి అధికంగా తీసుకోవటం మంచిది. శరీరం ఐరన్‌ను బాగా గ్రహించుకునేలా విటమిన్‌ సి తోడ్పడుతుంది.

మనం ఆరోగ్యంగా జీవితం గడపాలంటే ఐరన్ చాలా అవసరం. ఐతే ఇది పురుషులు, స్త్రీలు, గర్భిణులు, పిల్లలు ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది. ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ , కాయ ధాన్యాలు , రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యాలు ఎక్కువగా ఇనుము కలిగి ఉంటాయి. ఐతే ఆకు కూరల ద్వారా కేవలం 3 నుంచి 5 శాతం వరకే మనకు ఇనుము లభిస్తుంది. మొక్కల నుంచి మనకు వచ్చేది నాన్ హీమ్ ఐరనే కాబట్టి.. దీన్ని తక్కువగా మన శరీరం సంగ్రహిస్తుంది.

ప‌చ్చ‌ని కూర‌గాయలు పాల‌కూర, బ‌చ్చ‌లి కూరలో ఐర‌న్ అధికంగా ఉంటుంది. వీటి ఆకులు ముదురు ఆకు ప‌చ్చ‌రంగులో ఉంటాయి. ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి కాక విట‌మిన్ ఏ, సి, కె అధికంగా ఉంటాయి.అందుకే ఇవి రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. స‌లాడ్‌లో భాగంగా ఈ కూర‌ల‌ను తీసుకోవ‌చ్చు.పుట్ట‌గొడుగులు ఒక క‌ప్పు పుట్ట‌గొడుగుల్లో 0.3 మి.గ్రాముల ఐర‌న్ ఉంటుంది. ఇది 2 శాతం ఐర‌న్ అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల‌దు. ఒక పెద్ద కోడి గుడ్డులో 0.9 మి.గ్రాముల ఐర‌న్ ఉండ‌గా ఇది 5 శాతం రోజువారీ అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల‌దు.

ఈ మ‌ధ్య కాలంలో తృణ‌ధ్యానాలు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఓట్స్‌, క్వినోవా లాంటి వాటిలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. వైట్ రైస్‌కు బ‌దులు బ్ర‌వున్ రైస్‌ను తింటే ఫ‌లితం.న‌ట్స్‌ బాదం, జీడిప‌ప్పు, పిస్తా లాంటివాటిలో ఐర‌న్ ఉంటుంది. ఆహార పదార్థాల నుంచి శరీరానికి తగినంత ఇనుమును సమకూర్చుకోలేకపోతే.. సప్లిమెంట్ల రూపంలోనూ తీసుకోవచ్చు. ఐరన్ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ రూపంలో మందుల దుకాణాల్లో లభిస్తాయి. కానీ వీటిని వాడేముందు వైద్యుల సలహాతో వాడితే మంచిది.

ఐరన్ లోపం సమస్యను ఎక్కువగా పిల్లలు, మహిళలు, గర్భిణులు ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. మన దేశంలో 20 శాతం మంది మహిళలు, 50 శాతం మంది గర్భిణులు , 3 శాతం మంది పురుషులు ఎనీమియా సమస్యను ఎదుర్కుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మనం తీసుకోనే ఆహారంలో తగిని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Leave a Comment