High Blood Pressure: హైబీపీని కంట్రోల్ చేసే ఆహారాలు ఇవే..!

By manavaradhi.com

Updated on:

Follow Us

బీపీ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవినశైలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీకి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక ప్రెషర్‌ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక బ్లడ్‌ ప్రెషర్‌ 60 నుండి 80 మి.మీగాను నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆహారం, మెడిసిన్ ల ద్వారా దానిని నియంత్రించాలి. అవి పాటిస్తే మీ రక్తపోటు స్ధాయి తగ్గుముఖం పడుతుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే, అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. మీ బ్లడ్ ప్రెజర్ సహజ నియంత్రణలో ఉండాలంటే, ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవాలి.

బీపీని అదుపులో ఉంచే ఆహారాలు ఏంటి….?
రక్తపొటును అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ఆహారాలు చాల చక్కగా సహాయపడుతాయి. ముఖ్యంగా ఆకు కూరల్లో అనేక రకాల పోషకాలు అధికం లభిస్తాయి. వీటిలో ఐరన్ కూడా ఉంటుంది. ఇవి అధిక రక్తపోటు తగ్గిస్తాయి. టమాటా పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు ఈ పండు బాగా పని చేస్తుంది. వీటిలో వుండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా రక్తపోటు నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి,ఎ,ఇ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా రక్తపోటు నియంత్రిస్తాయి.

వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక రక్తపోటు నియంత్రణకు ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లి తినవచ్చు. పుచ్చకాయలో నియాసిన్‌, విటమిన్‌ సి, మాంగనీస్‌లు అధికంగా ఉంటాయి. ఇది బీపిని తగ్గిస్తుంది. హై బీపీ నివారణలో ఖర్బూజా చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. బ్రౌన్ రైస్ లో ఉండే క్యాల్షియం, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందునా హై బీపి ఉన్నవారికి ఇది పూర్తిగా సోడియం రహిత ఆహారం, కాబట్టి నిర్భయంగా తినవచ్చు. ఇది నరాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది.

పొటాషియం ఎంత ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు అంత ఎక్కువగా తగ్గుతుంది. కాబట్టి పొటాషియం దండిగా లభించే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. రోజుకి కనీసం 2-3 కప్పుల కూరగాయలు,పండ్లు తినాలి. మెగ్నీషియం తగినంత తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. పొట్టు తియ్యని ధాన్యాలు, గింజలు, గింజపప్పులు, సోయాతో చేసిన టోఫు, వెన్న తీసిన పాలు, తాజా కూరగాయలు, పప్పుల ద్వారానూ మెగ్నీషియం లభిస్తుంది.

బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఎండు పప్పులను కూడా చిరుతిండిగా తీసుకోవచ్చు. అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి. అంతకంటే అధికంగా తింటే వాటిలోని షుగర్ మీ శరీరంలోని షుగర్ స్ధాయి పెంచుతుంది. కనుక మితంగా తినండి. కొవ్వు వినియోగాన్ని రోజుకి ఒకటి లేదా రెండు చెమ్చాలకే పరిమితం చేయాలి. అంటే వేపుళ్లు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని అర్థం. అప్పుడే బీపీ అదుపులో ఉంటుంది.

సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును తగ్గించవచ్చు. పండ్లు, కూరగాయలను ఎంపిక చేసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం ఉన్న ఆహారాలు హైపర్ టెన్షన్ ని తగ్గిస్తాయి. అలాగే హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు.

Leave a Comment