High Blood Pressure Diet – బీపీ ను తగ్గించే ఆహారాలు ఏంటి ?

By manavaradhi.com

Updated on:

Follow Us

ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎవరిని పలకరించినా హై బి.పి ఉందని అంటున్నారు. అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సిన వ్యాధి. అధిక రక్తపోటులో రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అపుడు మీరు ఆహారం, మెడిసిన్ ల ద్వారా దానిని నియంత్రించాలి. డాక్టర్లు ఆరోగ్యకర ఆహారాన్ని సూచిస్తూ, కొన్ని మందులు వ్రాసి ఇస్తారు. అవి పాటిస్తే మీ రక్తపోటు స్ధాయి తగ్గుముఖం పడుతుంది. ఆరెంజ్, కివి, బెర్రీ, జామ, ద్రాక్ష మరియు స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే, అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. బ్లడ్ ప్రెజర్ సహజ నియంత్రణలో ఉండాలంటే, ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవాలి.

అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి. అంతకంటే అధికంగా తింటే వాటిలోని షుగర్ మీ శరీరంలోని షుగర్ స్ధాయి పెంచుతుంది. కనుక మితంగా తినండి. పొటాషియం ఎంత ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు అంత ఎక్కువగా తగ్గుతుంది. కాబట్టి పొటాషియం దండిగా లభించే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. రోజుకి కనీసం 2-3 కప్పుల ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు. 4-5 కప్పుల పండ్లు తినాలి. మెగ్నీషియం తగినంత తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. పొట్టు తియ్యని ధాన్యాలు, గింజలు, గింజపప్పులు, సోయాతో చేసిన టోఫు, వెన్న తీసిన పాలు, తాజా కూరగాయలు, పప్పుల ద్వారానూ మెగ్నీషియం లభిస్తుంది. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఎండు పప్పులను కూడా చిరుతిండిగా తీసుకోవచ్చు. మాంసాహారులైతే పల్చటి కండ మాంసాన్నే ఎంచుకోవాలి. రోజుకి 85 గ్రాముల కన్నా ఎక్కువ మాంసం తీసుకోకూడదు. వారంలో ఒకరోజు పూర్తిగా శాకాహారమే తీసుకుంటే మరింత ప్రయోజనం కనబడుతుంది. కొవ్వు వినియోగాన్ని రోజుకి ఒకటి లేదా రెండు చెమ్చాలకే పరిమితం చేయాలి. అంటే వేపుళ్లు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని అర్థం.

Leave a Comment