Health Tips: ఈ ఆహారాలు పొరపాటున కూడా పచ్చిగా తినకూడదు.. అవి ఇవేంటంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Raw Food Dangers

అన్ని రకాల ఆహారాలను ఒకే విధంగా తినడం మంచిది కాదు. ఒళ్లు తగ్గించుకునే ఉద్దేశంతో చాలా మంది పచ్చి ఆహారం మీదే దృష్టి పెడుతున్నారు. అయితే అన్ని రకాల పదార్థాలు పచ్చిగా తినడం వల్ల మేలు చేయకపోగా… అనేక రకాల అనారోగ్య సమస్యలను కలుగజేస్తాయి. అసలు ఇంతకీ వండకుండా పచ్చిగా తింటే హాని చేసే ఆహారాలు ఏవి…?

ఈ మధ్యకాలంలో పచ్చిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పట్ల ప్రజల్లో స్పృహ పెరిగింది. కొన్ని ఆహారాలను వండకుండా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందనే ఉద్దేశంతో చాలా ఆహారాలను పచ్చిగా తీసుకుంటున్నారు. అన్ని రకాల ఆహారాలను ఒకే విధంగా తినడం మంచిది కాదు. ఒక్కో ఆహారాన్ని ఒక్కో విధంగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల్ని పచనం చేయకుండా తినడం వల్ల అందులో ఉండే కొన్ని రకాల ప్రొటీన్లు సరైన స్థితికి రావు. అదే విధంగా మరికొన్నింటిని వండడం వల్ల అందులోని ప్రొటీన్స్ కోల్పోవలసి ఉంటుంది. అలాగే కొన్ని ఆహారాలు వండకుంటే విషపూరితంగా ఉంటాయి. మరికొన్ని ఆహారాలు తెగుళ్ళ నుంచి తట్టుకునేందుకు రసాయనాలు వాడుతారు. ఇవి కూడా వండకుండా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. వీటిని నేరు పచ్చిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి మొదలుకుని అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.

వండకుండా తీసుకోకూడని ఆహారాల్లో ప్రధానంగా చెప్పకోవలసింది మాంసం గురించే. దీన్ని పచ్చిగా తీసుకోవం వల్ల విషపూరితమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అరుగుదలలోనూ సమస్యలు మొదలౌతాయి. జీర్ణాశయంలో అరగడానికి కూడా సమయం పట్టి, సమస్యలను కొనితెస్తాయి. పచ్చి బీన్స్ లో లెక్టిన్స్ అనే ప్రొటీన్లు ఉంటాయి. అవి వండడం వల్ల తగ్గిపోతాయి. అన్ని రకాల లెక్టిన్స్ విషపూరితం కాదు. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. అందుకే వీటిని కనీసం సాధారణ స్థాయిలో ఉడకబెట్టడం లేదా వేయించడం మేలు చేస్తుంది. ఎండబెట్టిన బీన్స్ గింజలు కూడా సాధారణ స్థాయిలో వేపి తినడం మేలు.

బంగాళదుంపల్లో సోలనిన్ అనే పదార్థం ఉంటుంది. వీటిని ఉడకపెట్టకుండా లేదా, వేపకుండా తీసుకోవడం వల్ల సోలనైన్ అనేక సమస్యలు కలుగజేస్తుంది. విషపూరితమైన ఈ పదార్థం కారణంగా ప్రాణాలు పోయేంత పరిస్థి రాదు గానీ, కడుపునొప్పి, తలనొప్పి, పక్షవాతం లాంటి సమస్యలు ఎదురౌతాయి. అందుకే బంగాళ దుంపల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చిగా తీసుకోకూడదు.

చామ దుంపల్ని కూడా ఉడికించకుండా తీసుకోవడం మంచిది కాదు. ఇందులో పొటాషియం, విటమిన్ బి, సి,ఈలతో పాటు క్యాల్షియం, మినరల్స్ లాంటి ఎన్నో పదార్థాలు ఉంటాయి. అంతే కాదు ఫైబర్ స్థాయి కూడా ఇందులో అధికమే. ఈ మొక్క ఆకుల్లోనూ భారీ పోషకాలు లేక పోయినా, శరీరానికి మేలు చేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మాత్రం కిడ్నీల్లో రాళ్ళ లాంటి సమస్యలు ఏర్పడతాయి.

కర్రపెండలం కూడా దాదాపు ఈ రెండు ఆహారాల వంటిదే. ఇది ఎన్నో పేర్లతో ఎన్నో రూపాల్లో ఆహారంగా లభిస్తోంది. దీన్ని వండుకుని తినడం వల్ల శరీరానికి అద్భుతమైన పోషకాలు అందుతాయి. వీటిని పచ్చిగా తింటే శరీరంలో హైడ్రోజన్ సైనైడ్ గా మారి హాని కలుగజేస్తాయి. వీటితో తయారు చేసే సగ్గు బియ్యం కూడా ఊడకబెట్టి లేదా వేపుకుని తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఆముదపు గింజలు గతంలో మనుషులు, జంతువులు ఆహారంగా తీసుకునే వారు. వీటిని కూడా వండకుండా తీసుకోవడం మంచిది కాదు. బీన్స్ వలే వీటిలో కూడా రిసిన్ అనే పదార్థం ఉంటుంది. వీటిని వండడం ద్వారానే ఆముదం కూడా తయారౌతుంది. కొన్ని రకాల వంటకాల్లో దీనిని వాడతారు. వీటిని పచ్చిగా తీసుకోవడం వల్ల సరైన రుచి లేకపోవడంతో పాటు విషపూరితంగానూ ఉంటాయి.

ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్ ఆయిల్ వేడి చేసి తీసుకోవడం మంచిదే గానీ, అదే ఆలివ్ కాయలను తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఇవి రుచిలో చేదుగా ఉండడమే కాకుండా, విషయపూరితంగానూ ఉంటాయి. అలాగే పుట్టగొడుగులను కూడా సరైన విధంగా వండుకుని మాత్రమే తీసుకోవాలి. ఇవి పుట్టుకతో సిలింద్రాలు కావడం వల్ల పచ్చివి విషపూరితంగానే ఉంటాయి. కొన్ని రకాల పుట్టగొడుగులు ఉడికించి తీసుకున్నా, విషపూరితంగానే ఉంటాయి.

సాధారణంగా మాంసాన్ని ఉడికించకుండా తీసుకోవడం మంచి కాదు. పంది మాంసం విషయంలో మరిన్ని నియమాలు పాటించాలి. చాలా మంది ఫోర్క్ లో కొన్ని భాగాలను ఉడికించకుండానే పచ్చివి తింటూ ఉంటారు. ఇలాం చేయవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు ఎదురౌతాయి. చాలా సమయాల్లో మెదడు మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఏ ఆహారాన్ని తీసుకుంటున్నామన్నదే కాదు, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే.

Leave a Comment