Health Tips : వయస్సు 30 దాటిందా?…తీనే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Avoid These Foods for a Healthier Middle Age

ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. వయసుపెరిగేకొద్దీ రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. మనం కొన్ని ఆహరాలకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమైపోతోంది. దీంతోపాటు ప్రతి మనిషి తమ తమ కార్యాలయాలలో పని ఒత్తిడికి గురవుతుంటారు. శారీరక ఒత్తిడితోపాటు, మానసిక పరమైన ఒత్తిడిని కూడా ఎదుర్కోక తప్పడం లేదు. దీంతో వారిలో కోపం, నిరాశా.. నిస్పృహలు చుట్టుముడుతుంటాయి. వీటి వలన వారి పని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీవితంలో భోజనం కాస్తా మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది. దాంతో పోషకాహారం అందక పలు రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

సరైన ఆహారాన్ని ఎంపిక చేయడానికి అనేక కారణాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. నాలుకకు రుచిగా ఉన్నవి ఆరోగ్యానికి మంచిది కాదు అనేది వాస్తవం కాదు. ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి. వయసు పెరుగుతున్న ఎలాంటి ఆరోగ్యసమస్యలు తలెత్తవు.

మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి. కేకులు, కుకీలు, తెల్ల బ్రెడ్ వంటివన్నీ బేకరీ ఉత్పత్తులు, వీటిని అధిక మొత్తాల్లో ఈస్ట్, పంచదార మరియు ఇతర ప్రాసెస్డ్ పదార్థాలతో తయారుచేస్తారు. వీటిలో వాడే వస్తులు మన ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. బేకరీ ఆహారపదార్థాలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ఇతర అనారోగ్యాలను కలిగిస్తున్నాయి. చాకొలెట్‌లలో అధికంగా ఉండే కెఫీన్, థియోబ్రొమైన్, ఫ్యాట్ పదార్థాలు అసిడిటీని కలిగిస్తాయి. ఇక వీటిలో అధికంగా ఉండే కొకొవా గ్యాస్ వచ్చేందుకు కారణమవుతుంది. కనుక చాకొలెట్‌ను తినడం తగ్గిస్తే మంచిది. లేదంటే అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సోడా, ఇతర కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. దీంతోపాటు వీటిలో ఉండే ఎయిర్ బబుల్స్ జీర్ణాశయంలోకి వెళ్లి దాన్ని సాగదీసే పనిచేస్తాయి. అందువల్ల పొట్ట ఉబ్బుతుంది. ఫలితంగా గ్యాస్, అసిడిటీ వస్తాయి. కనుక వీటిని తీసుకోవడం కూడా మానేయాల్సి ఉంటుంది. రోజుకు ఒకటి, రెండు కప్పుల కాఫీ లేదా టీ తాగితే ఫరవాలేదు. కానీ అదే పనిగా వీటిని తాగితే వీటిలో ఉండే కెఫీన్ జీర్ణాశయం గోడలను నాశనం చేస్తుంది. కాబట్టి రోజూ కాఫీ, టీలను తక్కువగా తీసుకుంటే మంచిది.

ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది. ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.

తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి. కొంత మంది తక్కువ తిన్నా లావు అవుతుంటారు. మరి కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దీనికి కారణం వారికి అందే పోషకాలు అనే చెప్పుకోవాలి. ప్రమాదకరమైన కొవ్వులతో పాటు, ఆహారంలో అవసరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి చేసే కొవ్వుల వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది.

ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలకు కారణం అవుతుంది. చక్కని పోషకాహారంతో పాటు వ్యాయామం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మేలు చేస్తాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే అధికంగా నీరు తీసుకోవడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, తిన్న తర్వాత కాస్త దూరం నడవడం, నూనె, మసాలా, కారం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించిన‌ప్పుడు మ‌నం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటామ‌ని సెల‌విస్తున్నారు పోష‌కాహార నిపుణులు.

Leave a Comment