Bhadrachalam Temple: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి

By manavaradhi.com

Updated on:

Follow Us

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు.. ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలంకు సమీపంలో భద్రిరెడ్డిపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ పోకల దమ్మక్క అనే భక్తురాలు శ్రీరాముడిని అంచెంలమైన భక్తితో నిత్యం కొలుస్తుండేది. ఆ భక్తికి మెచ్చిన శ్రీరామ చంద్రుల వారు ఒక రోజు కలలో ఆమెకు దర్శనం ఇచ్చి … తాను భద్రగిరిపై కొలువై ఉన్నానని .. మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాటు చేయ్యమని.. ఇందుకు నీకు మరో రామ భక్తుడు సాయం చేస్తాడని దమ్మక్క కు ఆదేశించారట శ్రీరాముల వారు. దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ చిన్న పందిరి నిర్మించి శ్రీ సీతారామ చంద్రస్వామి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. కొంతకాలం తర్వాత కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఎంతో కన్నులపండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ద నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికి ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. సీతారాముల కళ్యాణమహౌత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక వివిధరాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు.

Leave a Comment