ముక్కలుగా మారిన మంగళగిరి వైఎస్సార్​సీపీ – తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు

By manavaradhi.com

Published on:

Follow Us

Mangalagiri YSRCP Cadere : మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయా… మంగళగిరిలో పార్టీ మూడు ముక్కలుగా చీలిందా…? అక్కడ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఆర్కే, వేమారెడ్డి, చిరంజీవి వర్గాలుగా విడిపోయారా…? ఆధిపత్యపోరులో మంగళగిరిలో ఏం జరుగుతుంది…!

మంగళగిరి గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఆ నియోజక వర్గం ఫలితాల గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్ తొలిసారి ప్రత్యేక్ష ఎన్నకల్లో అక్కడి నుంచి పోటిచేశారు. ఇక వైసీపి నుంచి ఆళ్ల రామకృష్ణ బరిలోదిగారు. అయితే 2019 ఎన్నికల్లో లోకేష్ పై ఆళ్ల విజయం సాధించారు. ఈ సారి కూడా 2024లో నారా లోకేస్ మంగళగిరి నుంచే ఎన్నికల బరిలో నిలవనున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఈ ఆదిపత్యపోరు చివరికి పార్టీలో చీలికలకు సైతం దారి తీస్తోంది. దీనివల్ల పలువురు నాయకుల్లో పార్టీపై అసమ్మతి పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు దిగివచ్చి పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. రాజధాని కీలక నియోజకవర్గంలో కూడా వైఎస్సార్​సీపీ పార్టీ ముక్కలుగా మారింది.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్​సీపీ పరిస్థితి చీలికలుపీలికలైంది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైఎస్సార్​సీపీని వీడినప్పటికీ ఆయన వర్గం ఒక గుంపుగా, ప్రస్తుత సమన్వయకర్త గంజి చిరంజీవి వర్గం ఇంకో జట్టుగా, తాడేపల్లి-మంగళగిరి నగర వైఎస్సార్​సీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మరో వర్గంగా చీలిపోయారు. మూడు గ్రూపులను సమావేశపరిచిన వైసీపి అగ్రనేతలు. ప్రస్తుత సమన్వయకర్త గంజి చిరంజీవి తన బలాన్ని కట్టుదిట్టం చేసుకునేందుకు, పార్టీలోని తన వర్గంలో నియామకాలు చేసుకుంటున్నారు. ఈ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి, మర్రి రాజశేఖర్‌ వైఎస్సార్​సీపీ కేంద్ర కార్యాలయంలో 3గ్రూపుల్ని సమావేశపరిచారు. ఎమ్మెల్యే ఆర్కే నియమించిన తాడేపల్లి పట్టణ వైఎస్సార్​సీపీ కమిటీని ఇటీవలే వేమారెడ్డి రద్దు చేశారు. తన వర్గీయులు అంజిరెడ్డి అధ్యక్షతన కొత్త కమిటీని ప్రకటించారు. ‘అసలు మేము పార్టీలో ఉన్నామా, లేమా అని, ఎవరికి తోచినట్లు వారు కమిటీలను వేసుకుంటూ పోతున్నారు’ అని వేమారెడ్డి తొలగించిన తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వేణు, సాయిరెడ్డిని ప్రశ్నించారు. దీంతో పార్టీ పెద్దలకు ఈపంచాయితీ పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరిని అంటే ఎవరు పార్టీని వీడతారో అని ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మూడు వర్గల వారిని పిలిచి మందలిద్నాం అనుకున్న పార్టీ పెద్దలకు గట్టి షాక్ తగిలింది… సమావేశంలో భాగంగా అభివృద్ధిని పట్టించుకోకపోవడాన్ని కొందరు నేతలు నేరుగా సాయిరెడ్డిని ప్రశ్నించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటి నుంచి హెలిప్యాడ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న పాత వంతెనకు మరమ్మతు చేస్తామని చెప్పి చాలాకామైందని తాడేపల్లికి చెందిన నాయకులు ప్రస్తావించారు. సీఎం ఇంటి వద్ద వంతెననే పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించేవారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వంతెన పూర్తి చేయడానికి ఇప్పుడు సమయం లేదని, ఎన్నికలు పూర్తైన తర్వాతే పనులు పూర్తి చేస్తాం అని సాయిరెడ్డి వారికి సమాధానమిచ్చారు. అంతేకాదు దుగ్గిరాల మండల ఎంపీటీసీలు , సర్పంచులు కూడా ఒక రోడ్డుగానీ, డ్రైన్‌గానీ కట్టలోకపోయామని ఆక్రోశించారు. ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడగాలని గట్టిగానే నిలదీసినట్లు తెలిసింది. దీంతో వారిని పిలిచి మాట్లాడుదాం అనుకున్న పార్టీ పెద్దలు చివరికి వారిని ఎదురుప్రశ్నలు రావడంతో ఏం చెప్పాలో తెలియక వారికి సరిద్ధి చెప్పి పంపిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Comment