Movies in Telugu : బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ – రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ – విజయ్ ‘లియో’

By manavaradhi.com

Updated on:

Follow Us

అక్టోబర్ 19న బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ విడుదల కానుంది. అదే రోజు విజయ్ ‘లియో’ మూవీ కూడా విడుదల కానుంది. ఆ మరుసటి రోజు అంటే.. అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరావు’ విడుదల కాబోతుంది. మొత్తానికి సినీప్రియులకు ఈ దసరా మరింత కనువిందు చేయనుంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ‘నేల కొండ భగవంత్‌ కేసరి.. ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది’ అంటున్నారు బాలకృష్ణ. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా శ్రీలీల ముఖ్యపాత్రలో నటించింది. అనిల్ రావిపుడి దర్శకత్వం వహించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది. ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ వయెలెన్స్ మోతాదు మించలేదని అంటున్నారు సెన్సార్ సభ్యులు.

ఇప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా పేరొందిన.. అనీల్ రావిపూడి బాలయ్యను ‘భగవత్ కేసరి’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గత సినిమాకు పూర్తి భిన్నంగా భగవంత్‌ కేసరి ఉంటుందని అనీల్ ప్రకటించాడు. కొత్తగా ఓ సినిమా ట్రై చేద్దామని ఇది చేశారంటా… దానికి బాలకృష్ణ రూపంలో సరైన ఆయుధం దొరికిందిని చేబుతున్నాడు దర్శకుడు. మరో సెంటిమెంట్ ఏంటంటే.. పండగ బరిలో బాలయ్య బాబు సినిమా ఉందంటే.. అది పక్కా హిట్ అని గత రికార్డులు చెప్తున్నాయి.. దీంతో బాలయ్య అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అనీల్ రావిపూడి – బాలయ్య కాంబోలో వస్తున్న ‘భగవత్ కేసరి’ విడుదలకు ముందు నుంచే పక్కా హిట్ అనే టాక్ వినిపిస్తుంది.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్‌ ఉన్న దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ లియో. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో లోకేష్‌ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి.

లియో సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ చాలా స్పెషల్ అంటా ఈవిషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా విషయంలో ఒక కొత్త ప్రయత్నం చేసారంట… ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని చెబుతున్నారు. ఇక లియో సినిమాలో మొదటి పదినిమిషాలు చాలా కీలకం మారనుంది. ఆ పదినిమిషాలను ఎవ్వరూ మిస్ అవకండి అంటున్నారు దర్శకులు.

మాస్ మహారాజ రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించే కథానాయకుడు. వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న బయోగ్రాఫికల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ స్టువర్టుపురం దొంగ అయిన టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. దసరా కానుకగా అక్టోబరు 20న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తరువాత రేణు దేశాయ్‌గారు కమ్ బ్యాచ్ ఇచ్చారు. రియల్ క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు.

ఈ సినిమా మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు భారీగా ఉండేలా కనిపిస్తున్నాయి. దీంతో ఈ దసరాకి రవితేజ ఖాతా ఒక భారీ హిట్ పడిదంటున్నారు అభిమానులు.

Leave a Comment