తిరుమలలోని హోటళ్లలో ఆహార పదార్థాల ధరలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోన్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమలలోని హోటళ్లలో ధరలు తగ్గాయంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న మెసేజ్ తమ దృష్టికి వచ్చిందని టిటిడి వెల్లడించింది. అందులో పేర్కొన్న ధరలు, ఇతర వివరాలు పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.
ఫేక్ న్యూస్‌తో శ్రీవారి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా తితిదే వెబ్‌సైట్ www.tirumala.org టిటిడి కాల్ సెంటర్ 18004254141 ద్వారా మాత్రమే తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఎలాంటి అనుమానాస్పద సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా అధికారిక వేదికల నుంచే తెలుసుకోవాలని పేర్కొన్నారు.