Telangana Election: బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు?

By manavaradhi.com

Updated on:

Follow Us

ఈ ఎన్నికల్లో తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి(BRS)కొలుకోలేని దెబ్బ తగిలింది. కెసీఆర్ గత 10 సంవత్సరాల నుంచి సాధించిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో ముచ్చటగా మూడో సారి విజయం సాధిస్తాం అన్న దీమాతో ఉన్న కెసీఆర్ అంచనాలు ఒక్క సారిగా తలకిందులయ్యాయి. ఇక్కడ గుర్తుంచుకోవాసిన విషమం ఏంటంటే ఎక్కవ శాతం గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతే కాదు ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలతోపాటు ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత అందుకు దోహదంచేసిందనే చెప్పాలి. ఫలితం చూస్తే మెుత్తం 119 స్థానాలకు 39 స్థానాలకే పరిమితమై కెసీఆర్ & టీంమ్ రెండోస్థానంలో నిలిచింది. గతంలో గెలిచిన 49 స్థానాలను ఆ పార్టీ కోల్పోయింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో గులాబి బాస్ సీఎం కేసీఆర్‌(KCR) రెండుచోట్ల పోటీచేసాడు.. అందులో కామారెడ్డిలో ఓటమి చవిచూశారు. ఆయన క్యాబినెట్ లో ఏకంగా ఆరుగురు మంత్రులకు పరాజయం ఎదురైయింది అంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు.

కర్ణుడి చావుకు సవాలక్షకారణాలు అన్నట్లు.. ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఓటమికి కారణాలు కూడా అన్నే ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, విధానాలు అనుకూలంగా మారతాయి అనుకున్న కెసీఆర్ నమ్మకం ఈ దఫా వమ్మయింది. పైగా వాటి వల్ల ఓట్లు రాకపోగా వాటిపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. ముఖ్యంగా దళితబంధు తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఎందుకంటే దీని ద్వారా కొద్దిమందికే లబ్ధిచేకూరడం, సాయం అందని వారిలో అసంతృప్తి పెంచింది. పైపెచ్చు ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులతో సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు, కొన్నిచోట్ల నాయకులు చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వ్యతిరేకతను పెంచాయని తెలుస్తోంది. బీసీబంధును ప్రకటించినా..దాన్నీ కొద్దిమందికే ఇచ్చారు. ఇదీ మిగిలిన వారిలో ఆగ్రహానికి కారణమయిందనే విమర్శలున్నాయి.

కెసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చెపట్టిన రెండు పడక గదుల ఇళ్లు కూడా ఆపార్టీ ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవీ చాలా కొద్దిమందికే దక్కాయి. ఇందులోనూ నాయకుల జోక్యం, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. పార్టీపై వ్యతిరేకత గూడుకట్టుకునేలా చేశాయి. రైతుబంధుతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరినప్పటికీ..గ్రామాల్లో వ్యవసాయంచేయని భూస్వాములకు అధిక మొత్తం అందుతుండటం సన్న, చిన్నకారు రైతులకు రుచించలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడం, రుణమాఫీ కింద ఇచ్చిన మొత్తం వడ్డీకే ఎక్కువగా సరిపోయిందనే అభిప్రాయం బలంగా నాటుకుంది. ఇలా రకరకాల అసంతృప్తులు బీఆర్ ఎస్ ఓటమికి కారణమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఉద్యోగ నియామకాల్లో జాప్యం, టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీల వల్ల పోటీ పరీక్షలకు సిద్ధపడిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పన్నెండు మంది మినహా సిట్టింగులందరికీ టికెట్లు కేటాయించారు. వీరిలో చాలా మందిపై వ్యతిరేకత ఉంది. అయితే పదేళ్లుగా వారు నియోజకవర్గాల్లో పట్టు సాధించినందున మళ్లీ గెలుస్తారనే భావన, వారికి టికెట్లు ఇవ్వకపోతే ఇతర పార్టీల్లోకి వెళతారనే అనుమానంతో అధిష్ఠానం వారివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Leave a Comment